కోనసీమలో మట్టి మాఫియా మళ్లీ మొదలైంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అధికారుల అండదండలతో రెచ్చిపోతోంది మట్టి మాఫియా. వరదలు తగ్గి ఇంకా 20 రోజులు కాకుండానే లంక ప్రాంతాల్లో మట్టి మాఫియా మొదలైంది. ప్రభుత్వ ఇళ్ల స్థలాల పేరు చెప్పి లంకలను గుల్ల చేస్తోంది మట్టి మాఫియా. అయినవిల్లి మండలం మడుపల్లిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. స్మశాన వాటికలను కూడా వదలడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండానే అనుమతులు ఉన్నాయి అని చెప్పి అధికారుల కళ్ళు గప్పి లంక మట్టిని తరలిస్తున్నారు. స్థానికులు నిలదీయగా అధికారులు తనిఖీ చేయడంతో ఈ గుట్టు బయట పడింది.
అయినవిల్లి ఎమ్మార్వో తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిమాఫియా తవ్వకాలు జరుపుతున్న విషయం బయటపడింది. స్థానిక అధికారులకు తెలియకుండా ఉన్నతాధికారుల అండదండలతోనే మట్టిని తవ్వుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం