Srikakulam: పెట్రోల్ కొట్టించేందుకు బైక్‌తో బంక్‌కు… ధూమ్ నుంచి శబ్ధాలు.. ఏంటా అని చూడగా

| Edited By: Ram Naramaneni

Mar 02, 2024 | 1:09 PM

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని పద్మనాభపురం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఓ పాము కలకలం సృష్టించింది. ఓ బైక్ డూమ్ భాగంలో సడన్ గా ప్రత్యక్షమై అందరినీ భయాందోళనలకు గురిచేసింది పాము. వాసుదేవరావు అనే కానిస్టేబుల్ తన బైక్ కు పెట్రోల్ కొట్టించేందుకు పెట్రోల్ బంక్ కి వచ్చాడు. బండి ఇంజన్ ఆపి పెట్రోల్ ట్యాంక్ కీ ఓపెన్ చేస్తుండగా...పాము కనిపించింది.

Srikakulam: పెట్రోల్ కొట్టించేందుకు బైక్‌తో బంక్‌కు... ధూమ్ నుంచి శబ్ధాలు.. ఏంటా అని చూడగా
Snake In Bike
Follow us on

పుట్టల్లోనో… పొదల్లోనో…ఉండాల్సిన పాములు ఈమధ్య బైకులు, కార్లు వంటి వాహనాల సందుల్లో దూరి తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎండవేడిమికి ఏ చెట్టుకిందో, పొదల చాటునో వాహనాలను పార్కింగ్ చేసే సందర్భంలో చటుక్కున వాహనాల్లోకి చొరబడి వాహనదారులను హడలెత్తిస్తున్నాయి. తీవ్ర భయాందోళనలకు గురిచేస్తూ కొన్ని సందర్భాలలో వాహనదారుల ప్రాణాలు మీదకు తెస్తున్నాయి పాములు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని పద్మనాభపురం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఓ పాము కలకలం సృష్టించింది. ఓ బైక్ డూమ్ భాగంలో సడన్ గా ప్రత్యక్షమై అందరినీ భయాందోళనలకు గురిచేసింది పాము. వాసుదేవరావు అనే కానిస్టేబుల్ తన బైక్ కు పెట్రోల్ కొట్టించేందుకు పెట్రోల్ బంక్ కి వచ్చాడు. బండి ఇంజన్ ఆపి పెట్రోల్ ట్యాంక్ కీ ఓపెన్ చేస్తుండగా…పాము కనిపించింది. బైక్ లోకి ఎలా దూరిందో, ఎప్పుడు దూరిందో తెలియదు గానీ బైక్ ముందు భాగంలో డూమ్ వద్ద వైర్ల మద్య చక్కగా తిష్ట వేసింది.నల్లని చారలతో నెమ్మదిగా కదులుతూ కనిపించిన పామును చూసి వాసుదేవరావు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. వెంటనే బైక్ ను అక్కడే వదిలి దూరంగా పరుగులు పెట్టాడు. అది గమనించిన స్థానికులలో ఒకరు ధైర్యం చేసి బైక్ దగ్గరకు వెళ్ళి కర్రతో శబ్ధం చేస్తూ పాముని బయటకు తోలే ప్రయత్నం చేశాడు. కాసేపు బైక్ సందుల్లో అటు ఇటూ తిరిగి చివరగా నెమ్మదిగా బైక్ లో నుండి జారుకుంది. అందరూ చూస్తుండగానే సమీపంలోని పొదల్లోకి దూరిపోయింది. దాంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్య పెద్ద గండమే గడిచింది అంటూ ఆనందపడ్డారు వాసుదేవరావు. పొరపాటున బైక్ డ్రైవింగ్ చేస్తుండగా ఆ పాము తన ఒంటిపైకి ఎగబాకితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదనీ హడలిపోయాడు వాసుదేవరావు. తాను పెట్రోల్ బంకుకి వచ్చే ముందు బైక్ ని ఓ ఖాళీ స్థలంలో చెట్టు నీడన ఉంచానని…అక్కడే పాము బైక్ లోకి చొరబడి ఉంటాదని అనుమానిస్తున్నాడు.

వాహనదారులు బీ కేర్ ఫుల్ అంటోంది ఈ ఘటన. పార్కింగ్ చేసే సందర్భంలో వాహనదారులు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది చెబుతోంది. నీడ కోసం చెట్టు కిందో, పొదల చాటునో వాహనాలను పార్కింగ్ చేయటంలో తప్పులేదు కానీ… పార్కింగ్ చేసే ముందు పరిసరాలను ఒకసారి పరిశీలించాలంటున్నారు నిపుణులు. ఎక్కడికైనా బయలుదేరే సందర్భంలో అనుమానం ఉంటే వాహనం ఎక్కే ముందు బైక్ హ్యాండిల్ అటు ఇటు ఒకసారిగా తిప్పి చూసుకోవటం… సీట్ పై శబ్దం చేయటం మంచిదని సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..