Nallajerla Road Accident: తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి

మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలియటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Nallajerla Road Accident: తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి
Accident

Updated on: Jun 12, 2023 | 8:45 AM

Nallajerla Road Accident: తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో చిన్నారి సహా ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలియటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.