పేకాట, కోడి పందేలు ఆడటం, నిర్వహించడం చట్టరీత్యా నేరం. అయినా కొన్ని ప్రదేశాల్లో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తూనే ఉన్నాయి. కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమచారంతో పోలీసులు వాటిని ఆపేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పేకాట, కోడి పందేలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి(Attack on SI) చేశారు. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండగా.. ఒక్క సారిగా ఎస్సైపై దాడికి పాల్పడ్డారు. చొక్కా లాగి మరీ కొట్టారు. విషయం తెలుసుకున్న సీఐ తన సిబ్బందితో కలిసి వెళ్లి.. ఘటనకు కారకులైన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని ఏలూరు(Eluru) జిల్లా యడవల్లిలో కొందరు పేకాట, కోడి పందేలు ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న ధర్మాజీగూడెం స్టేషన్ కానిస్టేబుళ్లు ఇద్దరు అక్కడికి వెళ్లారు. నిర్వాహకులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారు దుర్భాషలాడారు. దీంతో వచ్చిన కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే ఏఎస్సై రాంబాబు మరో కానిస్టేబుల్‌తో కలిసి యడవల్లి చేరుకున్నారు. కోడి పందేలు ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. వారు పోలీసులపై తిరగబడటంతో ఎస్సై దుర్గా మహేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్సై ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో ఎస్సై, స్థానికులు మధ్య తీవ్ర ఘర్షణ జరగింది. పెద్దఎత్తున చేరుకున్న స్థానికులు యూనిఫామ్‌లో ఉన్న ఎస్సైపై దాడి చేశారు. రహదారిపై పరిగెత్తిస్తూ చొక్కా లాగేసి మరీ కొట్టారు. ఈ ఘటనలో ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఐ మల్లేశ్వరరావుకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సీఐ ఎస్సైని చికిత్స కోసం చింతలపూడి ఆస్పత్రికి తరలించారు. ఎస్సైపై వ్యక్తిగత కక్షతో ఈ దాడికి పాల్పడ్డారని, వారిని గుర్తించి కేసులు నమోదు చేశామని పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Also Read
PM Modi – Joe Biden: యుద్ధ సమయంలో అగ్రనేతల భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న ప్రధాని మోడీ – బైడన్
Khammam: భజన చేస్తుండగా ఆలయంలోకి దూసుకొచ్చిన కారు.. ఇద్దరు చిన్నారుల మృతి..
Health Tips: ఈ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు టమోటా తినడం చాలా ప్రమాదకరం..!