Leopard Roaming: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో చిరుత పులి కలకలం సృష్టించింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో చిరుత పులి సంచరించింది. రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఓ అవును చిరుత పులి చంపేసింది. అది గమనించిన స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత సంచారానికి సంబంధించి వివరాలు సేకరించారు. చిరుత పాదముద్రలను సేకరించి.. ఆవుని చంపింది చిరుత పులే అని నిర్ధారించుకున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సూచించారు. చిరుత అడుగు జాడల ఆధారంగా అది ఎటువైపునకు వెళ్లిందనే దానిపై అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు చిరుతను బంధించాలంటూ అధికారులను స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. ఇదివరకు కూడా ఇలాగే ఓ అవును చిరుత పులి చంపి తినేసిందని చెప్పారు. చిరుత సంచారంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే అక్కడి ప్రజలు హడలిపోతున్నారు.
Also read:
Mozambique Attack: అందమైన ఆ దేశంలో అసలు ఏం జరుగుతుంది.. బీచ్ లో శవాల గుట్టలు.. తలలు లేని మొండాలు
Urvashi Rautela : అందాలందు ఊర్వశి అందాలే వేరయా.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న రౌతేలా హాట్ పిక్స్..
ఎటుపోతోంది ఈ సమాజం.. అటు వైద్యులు పట్టించుకోలేదు.. ఇటు ప్రజలూ పట్టించుకోలేదు.. చివరికి ఆ చిన్నారి..