Andhra News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి!

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులంతా మామిడికాయలు కోసే కూలీలుగా తెలుస్తోంది. మామిడికాయల లోడ్‌తో రైల్వే కోడూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం.

Andhra News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి!
Ttd Accident

Updated on: Jul 13, 2025 | 10:56 PM

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెలితే.. కొందరు కూలీలు మామిడికాయలు కోసేందుకు వచ్చి పని పూర్తి చేసుకొని.. కోసిన కాయలను మొత్తం లారీకి లోడ్‌ చేశారు. ఇక వాటిని రైల్వే కోడూరుకు తీసుకెళ్లేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో వారు వెళ్లతున్న లారీ రెడ్డి పల్లే చెరువుకట్టపైకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో డ్రైవర్‌ నియంత్రన కోల్పోయి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు, మరో 8 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ సహాయంతో స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.