
భార్యను హత్య చేసిన కేసులో కర్నూలు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యను హత్య చేసిన కేసులో ఓ భర్తకు కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ. 10 వేల జరిమాన విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలుకు చెందిన ముద్దాయి శ్రీనివాసులు, భార్య లక్ష్మీదేవి 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలోని శివప్ప నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే భర్త శ్రీనివాసులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీ స్టాల్ పెట్టుకొని కుటుంబాన్ని పోషించేవాడు. అయితే పెళ్లిన కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీనివాస్ భార్యను తరచూ అనుమానిస్తూ ఉండేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి.
ఈ క్రమంలోనే 2018 నవంబర్ 18 తేదిన తన భార్యని లక్ష్మిని శ్రీనివాసులు గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కర్నూలు నాల్గవ పట్టణ పోలీసులు అతనిపై 415/ 2018 కింద మర్డర్ కేసు గా నమోదు చేశారు. అప్పట్లో దర్యాప్తు అధికారిగా ఉన్న సిఐ మహేశ్వర్ రెడ్డి కేసుపై ఛార్జ్ షీట్ వేశారు. అన్ని కోణాల్లో ఈ కేసును విచారించిన తర్వాత నేరం ఋజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు సహా రూ.10 వేల జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కమలా దేవి తీర్పును వెలువరించింది.
కేసు వాధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి. సరళాదేవి, కేసు నమోదు చేసి, పక్కాగా దరాప్తు చేసిన కర్నూలు డిస్పీ బాబు ప్రసాద్, కర్నూలు నాల్గవ పట్టణ సిఐ విక్రమసింహా గారులను, సాక్షులను కోర్టు యందు హాజరు పరిచిన ఎఎస్సై సుబ్బరాజు, కోర్టు కానిస్టేబుల్ ఎమ్. వెంకటరమణ లను జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ప్రత్యేకంగా అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.