AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరిగింది. అయితే ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కలిదిండి మండలంలోని కోరుకల్లు గ్రామానికి కూడా పోలింగ్ జరిగింది. ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన లీలా కనకదుర్గ.. తన ఓటును వినియోగించుకున్న కాసేపటికే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడబిడ్డ జననం తమ అదృష్టం అంటూ ఆమె కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంది.
పూర్తి వివరాల్లోకెళితే.. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికే లీలా కనకదుర్గ నిండు గర్భిణీ. అంతలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడంతో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. తాను పోటీ చేస్తున్న గ్రామానికి రెండో దశలో పోలింగ్ నిర్ణయించగా.. గర్భంతోనే ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఇవాళ పోలింగ్ కావడంతో లీలాకనకదుర్గ తన ఓటును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు డెలివరీ చేయగా.. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే, సర్పంచిగా పోటీ చేసి ఓటు వేసిన రోజే తనకు ఆడబిడ్డ పుట్టడం అదృష్టంగా భావిస్తున్ననని పేర్కొన్న లీలాకనకదుర్గ.. ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also read:
సాగర్ ఉపఎన్నికకు పార్టీల సైరన్ .. టీఆర్‌ఎస్ సభకు పోటీగా పాదయాత్రకు సిద్ధమవుతున్న కోమటిరెడ్డి
ఏంటి సామి ఇది.. ఏకంగా షాపు లోడునే అక్రమంగా తరలిస్తున్నారుగా..! అది కూడా కోళ్ల ఎరువు పేరుతో