Diarrhea Cases: రాష్ట్రంలో డయేరియా విజృంభణ.. అక్కడ రెండ్రోజులపాటు చికెన్‌, మటన్‌, చేపల అమ్మకం నిషేధం..

ఏపీలో డయేరియా టెన్షన్‌ కంటిన్యూ అవుతోంది. జగ్గయ్యపేట పరిధిలోని 8 గ్రామాల్లో డయేరియా బాధితులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. షేర్ మహమ్మద్‌పేట, చిలకల్లు, మక్కపేట, వత్సవాయి, అనుమంచిపల్లి, బుదవాడ, గండ్రాయి, దేచుపాలెం గ్రామాలతోపాటు జగ్గయ్యపేట పట్టణంలోని మోడల్ కాలనీ, సీతారాంపురం ప్రాంతాల్లో అతిసార ప్రబలింది.

Diarrhea Cases: రాష్ట్రంలో డయేరియా విజృంభణ.. అక్కడ రెండ్రోజులపాటు చికెన్‌, మటన్‌, చేపల అమ్మకం నిషేధం..
Non Veg

Updated on: Jun 23, 2024 | 1:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో డయేరియా టెన్షన్‌ కంటిన్యూ అవుతోంది. జగ్గయ్యపేట పరిధిలోని 8 గ్రామాల్లో డయేరియా బాధితులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. షేర్ మహమ్మద్‌పేట, చిలకల్లు, మక్కపేట, వత్సవాయి, అనుమంచిపల్లి, బుదవాడ, గండ్రాయి, దేచుపాలెం గ్రామాలతోపాటు జగ్గయ్యపేట పట్టణంలోని మోడల్ కాలనీ, సీతారాంపురం ప్రాంతాల్లో అతిసార ప్రబలింది. వందల మంది అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో 16మంది వైద్యులతో 24గంటలపాటు వైద్యం అందిస్తున్నారు. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో డయేరియా రోగులను పరామర్శించిన మంత్రి సత్యకుమార్‌… టీవీ9తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. అధికారికంగా 58 కేసులు మాత్రమే నమోదైనట్టు చెప్పారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రజలకు సూచించారు మంత్రి సత్యకుమార్‌. అతిసార ప్రబలడానికి తాగునీళ్లు కలుషితం కావడమే కారణమన్నారు. వాటర్‌ శాంపిల్స్‌ను ఇప్పటికే టెస్టింగ్‌ ల్యాబ్స్‌కు పంపినట్టు చెప్పారు.

నాన్ వెజ్ బంద్..

కాగా.. డయేరియాతో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందగా.. 100మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చేరినట్లు చెబుతున్నారు. అందరికీ డయేరియాగా నిర్ధారణ కాలేదని.. 58 కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయని అధికారులు చెబుతున్నారు.. రోగులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. డయేరియా విజృంభణ నేపథ్యంలో జగ్గయ్యపేటలో రెండ్రోజులపాటు చికెన్‌, మటన్‌, చేపల అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు.

వీడియో చూడండి..

8 జిల్లాల్లో కేసులు..

అతిసార ప్రబలడానికి తాగునీళ్లు కలుషితం కావడమే కారణమన్నారు ఏపీ ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ కృష్ణబాబు. వాటర్‌ శాంపిల్స్‌ను ఇప్పటికే టెస్టింగ్‌ ల్యాబ్స్‌కు పంపినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో డయేరియా బయటపడినట్టు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..