
మాచర్ల ఘటనపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒక కులంపై హింసాత్మక ముద్ర వేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గతంలో కూడా వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జగన్ అధికారంలోకి రాకుండా చూసేది పవన్ కల్యాణ్, చంద్రబాబు కాదన్న సజ్జల.. రైతులు, వృద్ధులు, మహిళలు వద్దనుకుంటే జగన్ అధికారంలోకి రాకుండా ఆపగలుగుతారన్నారు. పవన్ మాట్లాడే స్క్రిప్ట్ బయట ఎక్కడో తయారవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ ను ఆంధ్రప్రదేశ్ కు రోజూ రావద్దని ఎవరు చెప్పారన్న సజ్జల.. కేఏ పాల్ కూడా రావచ్చని ప్రజా శాంతి పార్టీని ఉద్దేశించి చెప్పారు. వారానికి ఎన్ని రోజులు ఉంటారనేది ప్రశ్న కాదన్న సజ్జల.. వచ్చి ఏమి చేస్తారనేదే ప్రశ్నగా మారుతోందని తెలిపారు. మాజీ ముఖ్మమంత్రి చంద్రబాబు.. ఎప్పుడూ తగలబెట్టాలనే ఆలోచనలోనే ఉంటారని విమర్శించారు. మాచర్లలో చంద్రబాబు నిజ స్వరూపం బయటపడిందని స్పష్టం చేశారు.
మరోవైపు.. పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పవర్ లేని స్టార్ పవన్ అని విమర్శించారు. స్థాయికి మించి మాట్లాడుతున్నారని హెచ్చచరించారు. కాల్షీట్ ఉంటే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు, కాల్షీట్స్ కాలి అయితే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుంటారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ను కాపులు కూడా నమ్మే స్థితిలో లేరని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి వెలంపల్లి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..