accident in nandigama : 108 వాహనం ఢీ కొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.. కృష్ణ జిల్లా నందిగామలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోర్ వెల్ కంపెనీలో పనిచేయడానికి ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి సోమవారం రోడ్డు దాటుతుండగా విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న 108 వాహనం ఢీకొంది. దాంతో స్థానికులు అతడిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
RRB NTPC 2nd Phase CBT exam: ఆర్ఆర్‌బి ఎన్టీపీసీ సెకండ్ పేజ్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
Actress Sanjana Galrani : మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్న’బుజ్జిగాడు’ బ్యూటీ..