Road Accident: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నేండ్రగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బంగారుం పాలెంకు చెందిన రాణెమ్మతో పాటు కర్ణాటకలోని నంగిలి ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు మహిళలుగా గుర్తించారు. అయితే మృతులు వైంకుఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల కొండకు వచ్చారు. దేవుడి దర్శనం అనంతం తిరుగు ప్రయాణం అయ్యారు. సరిగ్గా నేండ్రగుంట వద్దకు చేరుకోగానే వారు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రథమిక అంచనాకు వచ్చారు.
Also read:
Open Challenge: రాజీనామాకు మేం సిద్ధం.. మీరు సిద్ధమా?.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏపీ నేత సవాల్..