
100 సంవత్సరాల తర్వాత దేశంలోనే తొలిసారిగా ఏపీలో భూములను రీ సర్వే ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. గత ఏడాది చివరలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో భూసర్వే – శాశ్వత భూహక్కు కింద పత్రాలను సీఎం జగన్ అందించిన సంగతి తెలిసిందే.. రెండేళ్ల కిందట ప్రారంభమైన సర్వేలో రెండు వేల గ్రామాల్లో పూర్తయింది. అన్ని భూసమస్యలను పరిష్కరించి.. యజమానులకు క్యూఆర్ కోడ్‌తో ఉన్న పత్రాలను అందించారు ముఖ్యమంత్రి. శాశ్వత భూహక్కు-భూరక్ష కోసం జగన్ ప్రభుత్వం మందుకు కదులుతోంది. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని.. ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశించారు సీఎం జగన్.
అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలా ప్లాన్ చేశారు. సర్వేచేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో సహితం రికార్డులు అప్‌డేట్ చేయనున్నారు. భూమి కార్డులను రైతులకు ఇవ్వనున్నారు. అనుకున్న సమయంలోగా సర్వేను పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సర్వే వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి అవసరమైన వనరులను సమకూర్చుకున్నారు. సర్వే వేగంగా చేయడానికి డ్రోన్లు సహా ఇతర టెక్నికల్ మెటీరియల్‌తోపాటు సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసుకోవాలన్నారు.
ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సంబంధిత విభాగాల అధికారులతో కూడా సమగ్ర సర్వేపై సమీక్ష కొనసాగుతోంది. సర్వే ఆఫ్ ఇండియాతో కూడా సమన్వయం చేసుకొని.. నిర్దేశించుకున్న గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది సీఎం జగన్ యోచన.
ఇదిలావుంటే, తాజాగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, భూముల హద్దులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అతిపెద్ద భూ సర్వే చేపట్టామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. వివాదాలకు ఆస్కారం లేకుండా పూని పూర్తి చేస్తున్నట్లుగా తెలిపారు. భూసంస్కరణలపై రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. అదనంగా రూ.500 కోట్లతో ఏడాదిలో సర్వే పూర్తి చేస్తామని ప్రకటించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిగ్గుతేల్చేందుకు 10 వేల మందిని కలిపినట్లుగా తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లతో 4 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసిందని వివరించారు.
ఎలాంటి రాజకీయ ఉద్దేశాలతో సర్వే చేపట్టలేదని స్పష్టం చేశారు. అంతకుముందు, అనేక మంది పేదల జీవనోపాధికి సంబంధించిన అసైన్డ్ భూముల సమస్య, ముఖ్యంగా బలహీన వర్గాలు, షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) జీవనోపాధికి సంబంధించిన సమస్య ఎప్పుడూ పరిష్కరించబడలేదని ఆయన ఎత్తి చూపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం