గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున.. గుంటూరు(Guntur) లో మరోసారి జిన్నా టవర్ ( Jinnah tower) వివాదం రాజుకుంది. జిన్నా టవర్ పై జాతీయ జెండా(National Flag) ఎగురవేస్తామని హిందూ వాహిని ప్రకటించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అన్నట్టుగానే జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగరేసేందుకు ప్రయత్నించారు హిందూ వాహినీ కార్యకర్తలు. కాగా వీరి ప్రయత్నాన్నిపోలీసులు అడ్డుకున్నారు. టవర్‌వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించినవారిని.. అరెస్ట్ చేసి అక్కణ్నుంచి తరలించారు. దీంతో, టవర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా టవర్ వైపు ఎవర్నీ రానీయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. టవర్ చుట్టూ ఇప్పటికే భారీ కంచెను నిర్మించింది కార్పొరేషన్. దాని చుట్టూ మరిన్ని భారీకేడ్‌లు ఏర్పాటు చేశారు పోలీసులు.
వివాదం మొదలైందిలా..
కాగా ఈ టవర్‌కు పేరు మార్చాలన్న బీజేపీ నేతల డిమాండ్‌తో ఈ వివాదం మొదలైంది. 75ఏళ్ల తర్వాత కూడా ఓ దేశద్రోహి పేరుతో సెంటర్ ఉండటం దేశానికే అవమానమంటున్నారు బీజేపీ నేతలు. దాని పేరు మార్చాలనీ.. లేకపోతే కూల్చేస్తామని ఇటీవల బీజేపీ నేతలు హెచ్చరించడం వివాదానికి బీజం వేసింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. జిన్నా టవర్‌పై పెట్టిన ట్వీట్.. ఈ రచ్చకు కారణమైంది. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ నాయకుడు, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జిన్నా సెంటర్ పేరు మార్చాలని డిమాండ్ చేసిన రాజాసింగ్.. ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ కార్యకర్తలు జిన్నా టవర్‌ను కూలగొట్టండి అంటూ కామెంట్ చేశారు. వెంటనే ఆ పేరును తొలిగించి స్వాతంత్య్ర యోధుల పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
Coronavirus: రెండోసారి కరోనా బారిన పడిన యానీ మాస్టర్.. క్వారంటైన్ కష్టంగా ఉందంటూ పోస్ట్..
Ravi Teja Birthday: యాక్షన్ మోడ్ లో రామారావు.. ఆకట్టుకుంటోన్న మాస్ మహారాజా బర్త్ డే పోస్టర్..