తిరుపతి: అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి తిరుపతి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కడప జిల్లాకు చెందిన గంగిరెడ్డి.. 27 ఎర్రచందనం కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. గాజులమండ్యం కేసులో ఆయనకు తిరుపతి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈయన 2015 నుంచి కడప సెంట్రల్ జైలులో ఉన్నారు. గతంలో గంగిరెడ్డిని కడప పోలీసులు శ్రీలంకలో అరెస్టు చేసి తీసుకొచ్చారు. తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కాసేపట్లో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. మాజీ సీఎం చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బ్లాస్ట్‌లో సైతం గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నారు.