
సముద్రంలో మిలియన్ల కొద్ది జీవరాసులుంటాయి. చేపలు, రొయ్యలు, నత్తలు, తాబేళ్ళు. ఇలా అనేక రకాల జీవులు సముద్రంపై ఆధారపడి జీవిస్తుంటాయి. వాటిలో ఒక్కో జాతి ఒక్కో స్వభావం కలిగి ఉంటాయి. చేపల్లోనూ అనేక రకాలు ఉంటాయి. కొన్ని ప్రకృతి విపత్తుల సమయంలోనో, లేదా సముద్రంలో వచ్చే భారీ అలకారణంగా అవి ఒడ్డుకు చేరుతుంటాయి. వాటిని చూసిన జనాలు కూడా ఆచర్యపోతూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే విశాఖ తీరంలో వెలుగు చూసింది. ఒక వింత చేప సమద్రతీరంలో దర్శనమించింది.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని ఋషికొండ తీర ప్రాంతంలో మత్స్యకారులకు అరుదైన చేప జాతికి చెందిన జీవిచిక్కింది. శరీరంపై విభిన్నమైన చారలతో ప్రత్యేకంగా కనిపించింది. ఈ చేప తీరానికి చేరేలోగా నిర్జీవంగా మారింది. స్పాటెడ్ మోరే ఈల్స్.. గా పిలవబడే ఈ చేపల రకానికి చెందిన జీవిని మన మత్స్యకారులు కలిమొయిగా పిలుస్తారు. చూడ్డానికి ఈ చేప చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని శరీరంపై చిరుత పులి లాంటి చారలు కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా సముద్రంలో లోతైన ప్రాంతాల్లో ఉండే రాళ్ల మధ్య ఆవాసం ఏర్పరుచుకొని ఇవి జీవనం సాగిస్తాయి.
ఈ చేప ప్రత్యేక ఏమిటి
ఈ కలిమొయి చేపకు పదునైన దంతాలు ఉంటాయి. ఇది దాదాపుగా 5 మీటర్ల పొడవు వరకు పెరుగుతుందని చెబుతున్నారు సముద్ర మత్స్య పరిశోధన శాస్త్రవేత్తలు. సముద్రం లోని లోతైన ప్రాంతంలో నివసించే ఈ చేపలు రాత్రిపూట ఎక్కువగా ఈ ఆహార అన్వేషణ చేస్తూ ఉంటటాయని.. అయితే ఇవి వలకు చిక్కడం చాలా అరుదని అధికారులు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.