Ram Gopal Varma: కట్టప్ప ను ఎవరు చంపారంటూ.. మరోసారి ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవి సంచలన ట్వీట్..

|

Jan 11, 2022 | 11:28 AM

Ram Gopal Varma:  ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్స్ ధరల తగ్గింపు పై ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య జరుగుతున్న యుద్ధం తెలుగు సీరియల్ తలపిస్తూ.. కొనసాగుతూనే ఉంది. సినిమా టికెట్స్...

Ram Gopal Varma: కట్టప్ప ను ఎవరు చంపారంటూ.. మరోసారి ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవి సంచలన ట్వీట్..
Ram Gopal Varma
Follow us on

Ram Gopal Varma:  ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్స్ ధరల తగ్గింపు పై ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య జరుగుతున్న యుద్ధం తెలుగు సీరియల్ తలపిస్తూ.. కొనసాగుతూనే ఉంది. సినిమా టికెట్స్ ధరల నిర్ణయం పై సంచలన దర్శకుడు, వివాదాల వర్మ రంగంలోకి దిగిన అనంతరం.. మరింత మాటల యుద్ధం మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా మళ్ళీ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ పిట్ట కూత కూసింది. మళ్ళీ తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల నిర్ణయంపై నిరసన తెలియజేశారు.

తెలుగు సినిమా అయిన సరే మహారాష్ట్రలో ఆర్ఆర్ఆర్ టికెట్ ధర ను పెంచుకోవడానికి అనుమతినిచ్చింది.
RRR టిక్కెట్ ధర రూ. 2200/-గా నిర్ణయించింది. అదే తెలుగు వారి సొంత రాష్ట్రంమైన ఆంధ్రప్రదేశ్ లో తమ సినిమా టికెట్ ధరను కనీసం రూ. 200/-లకు కూడా అమ్మలేకపోతున్నారు. ఇది తెలుగు వారి అస్తిత్వం గురించి ప్రశ్నను లేవనెత్తుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు “కట్టప్పను ఎవరు చంపారు? ” అంటూ.. ఎవరు సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నారంటూ ఇన్ డైరెక్ట్ గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీరుని తప్పు పట్టారు. నిన్న మంత్రి పేర్ని నానితో రామ్ గోపాల్ వర్మ టికెట్ ధర విషయంపై భేటి అయిన సంగతి తెలిసిందే..

 

 

 

Also Read:  నేడు మహా నేత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి వర్ధంతి.. ఇప్పటికీ ఆయన మరణం ఓ మిస్టరీనే..