AP Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనను అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర , యానాం ప్రాంతాలల్లో ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. అంతేకాదు.. ఒకటి లేక రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
ఇక ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
మరోవైపు రాయలసీమ లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల మోస్తరు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల భారీ కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దీంతో ఏపీలో ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది.
ఇలా ఉండగా, ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. కేరళ సముద్ర తీరం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయని .. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also Read: గవ్వలు లక్ష్మీదేవి స్వరూపం .. ఈ గవ్వల ఏ స్థానంలో ఉంటే ధనానికి లోటు ఉండదో తెలుసా..!