AP Rains: పొంచివున్న వాయుగుండం.. రానున్న మూడు రోజుల్లో మళ్లీ వర్షాలు.. మరి ఏపీపై ప్రభావం ఎంతంటే?

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ఉపరితల ద్రోణి బుధవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది..

AP Rains: పొంచివున్న వాయుగుండం.. రానున్న మూడు రోజుల్లో మళ్లీ వర్షాలు.. మరి ఏపీపై ప్రభావం ఎంతంటే?
Ap Rains

Updated on: Dec 22, 2022 | 9:48 AM

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ఉపరితల ద్రోణి బుధవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం వాయుగుండంగా బలపడిందని తెలిపింది. అనంతరం ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు పయనించే అవకాశం ఉందని ఐఎండీ ఓ నివేదికలో పేర్కొంది. ఈ ద్రోణీ కారణంగా రానున్న మూడు రోజుల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొంది.

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దీని ప్రభావం నామమాత్రంగా ఉండనుందని చెప్పారు. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉత్తర కోస్తాంద్రలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, ఏపీవ్యాప్తంగా ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తుండటంతో.. రాష్ట్రమంతటా దట్టమైన పొగమంచు, చలి ప్రభావం పెరుగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us