కళ్లముందే మృత్యువులా దూసుకొచ్చిన వాగు.. స్కూల్ టీచర్‌ను లాక్కెళ్లిన నీరు!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముంచంగిపుట్టు మండలం కర్లపొదురులో వాగు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించింది. అదే సమయంలో వాగు దాటేందుకు పాఠశాల ఉపాధ్యాయురాలు మణి ప్రయత్నించింది. ఇంతలో స్థానికుల సాయంతో టీచర్‌కు పెను ప్రమాదం తప్పింది.

కళ్లముందే మృత్యువులా దూసుకొచ్చిన వాగు.. స్కూల్ టీచర్‌ను లాక్కెళ్లిన నీరు!
School Teacher In Raging Stream

Updated on: Aug 11, 2026 | 11:10 AM

అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముంచంగిపుట్టు మండలం కర్లపొదురులో వాగు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించింది. అదే సమయంలో వాగు దాటేందుకు పాఠశాల ఉపాధ్యాయురాలు మణి ప్రయత్నించింది. ఇంతలో స్థానికుల సాయంతో టీచర్‌కు పెను ప్రమాదం తప్పింది.

రోజువారీ విధుల్లో భాగంగా పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఉపాధ్యాయురాలు మణి వాగును దాటేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే వాగులో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఆమె అదుపుతప్పి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా శ్రమించి ఉపాధ్యాయురాలిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ స్థానికులు సకాలంలో స్పందించడంతో ఉపాధ్యాయురాలికి ప్రాణాపాయం తప్పింది. ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

భారీ వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, గెడ్డలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటేందుకు ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రయత్నించవద్దని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us