Prakasam Crime News: భార్య అన్నం పెట్టలేదని ఆగ్రహించిన భర్త ఆమె ప్రాణాలను తీశాడు. ఈ ఘోర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మార్కాపురం మండల పరిధిలోని జమునపల్లె చెంచు కాలనీకి చెందిన దాసరి చిన్న అంకాలు మద్యం సేవించి వచ్చి, భార్య బసవమ్మ(35)తో బుధవారం రాత్రి గొడవపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న చిన్న అంకాలు భోజనం పెట్టలేదనే నెపంతో తెల్లవారుజామున ఆమెపై కర్రతో దాడి చేశాడు. దాడి ఆ కర్ర అదుపు తప్పి బసవమ్మ గుండెల్లో గుచ్చుకోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.