పోలీసులకు అడ్డంగా దొరికిన దొంగ పోలీసులు

| Edited By:

Mar 09, 2019 | 12:24 PM

హైవే పెట్రోలింగ్ పోలీసులుగా మారిన దొంగల ముఠాను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. పోలీస్ యూనిఫామ్స్, వెహికల్, బేడీలు, లాఠీలు, వాకీటాకీలు రెడీ చేసుకుని హైవేపై హల్చల్ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా భారీ వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సులువుగా డబ్బు సంపాదించడానికి అనుమానం రాని మార్గాన్ని ఎంచుకుందీ ముఠా. లేని బిల్డప్ ప్రదర్శిస్తూ జనాన్ని మోసం చేసేందుకు కొత్త గెటప్ వేసింది. బెంగుళూరుకు చెందిన డేనియల్, ఒడిశా రాష్ట్రానికి […]

పోలీసులకు అడ్డంగా దొరికిన దొంగ పోలీసులు
Follow us on

హైవే పెట్రోలింగ్ పోలీసులుగా మారిన దొంగల ముఠాను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. పోలీస్ యూనిఫామ్స్, వెహికల్, బేడీలు, లాఠీలు, వాకీటాకీలు రెడీ చేసుకుని హైవేపై హల్చల్ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా భారీ వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సులువుగా డబ్బు సంపాదించడానికి అనుమానం రాని మార్గాన్ని ఎంచుకుందీ ముఠా. లేని బిల్డప్ ప్రదర్శిస్తూ జనాన్ని మోసం చేసేందుకు కొత్త గెటప్ వేసింది. బెంగుళూరుకు చెందిన డేనియల్, ఒడిశా రాష్ట్రానికి చెందిన మదన్ శెట్టితో పాటు మనోజ్, శేఖర్, నాయుడు అనే ముగ్గురితో చేతులు కలిపి నకిలీ పోలీసు అవతారమెత్తారు.