రోడ్లపై అల్లరి చేస్తే.. కోర్టులకు వెళ్లాల్సిందే!

| Edited By:

Dec 31, 2019 | 12:44 PM

రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే చర్యలు తప్పవని తిరుపతి పోలీసులు హెచ్చరించారు. నూతన సంవత్సరం సంబరాల పేరుతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. అర్థరాత్రి 1 గంట వరకూ పార్టీలకు, సెలబ్రేషన్స్‌కి అనుమతిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు. రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకునే యువతకు వారి తల్లిదండ్రులు సరైన సూచనలు చేసి సహకరించాలని పోలీసులు కోరారు. రోడ్లపై అల్లరి చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే చట్టప్రకారం చర్యలు తప్పవి.. […]

రోడ్లపై అల్లరి చేస్తే.. కోర్టులకు వెళ్లాల్సిందే!
Follow us on

రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే చర్యలు తప్పవని తిరుపతి పోలీసులు హెచ్చరించారు. నూతన సంవత్సరం సంబరాల పేరుతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. అర్థరాత్రి 1 గంట వరకూ పార్టీలకు, సెలబ్రేషన్స్‌కి అనుమతిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు. రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకునే యువతకు వారి తల్లిదండ్రులు సరైన సూచనలు చేసి సహకరించాలని పోలీసులు కోరారు. రోడ్లపై అల్లరి చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే చట్టప్రకారం చర్యలు తప్పవి.. ప్రతీ కూడలిలో పోలీసుల నిఘా, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగుతుందని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ పేర్కొన్నారు.