పెళ్లికి వచ్చిన అతిథులకు షాక్.. ఫంక్షన్‏కు వచ్చిన ఒక్కొక్కరికి రూ.1000 ఫైన్.. కారణం తెలిసి అవాక్కైన బంధువులు..

కరోనా సృష్టిస్తున్న కల్లోలంతో గుంపులుగా గుంపులుగా కనిపిస్తే చాలు అదో పెద్ద నేరంగా చూస్తున్నారు. ఇక ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవాలంటే..

పెళ్లికి వచ్చిన అతిథులకు షాక్.. ఫంక్షన్‏కు వచ్చిన ఒక్కొక్కరికి రూ.1000 ఫైన్.. కారణం తెలిసి అవాక్కైన బంధువులు..
Wedding

Updated on: Jun 01, 2021 | 6:30 PM

కరోనా సృష్టిస్తున్న కల్లోలంతో గుంపులుగా గుంపులుగా కనిపిస్తే చాలు అదో పెద్ద నేరంగా చూస్తున్నారు. ఇక ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవాలంటే.. కావాల్సిన వారిని పిలవకుండా… జరిపించుకోవాల్సి వస్తోంది. ఇక కరోనా మహమ్మారి వలన వివాహాలకు అనుమతి తీసుకొని.. నిబంధనలు పాటిస్తూ జరిపించుకోవాలి. దీంతో చాలా మంది ఈ పరిస్థితుల్లో ఎలాంటి శుభకార్యం చేసుకోకపోవడమే అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. మరికొంత మంది మాత్రం లాక్ డౌన్ సమయంలోనూ కరోనా నిబంధనలను పాటిస్తూ.. పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఇక మరికొంత మంది కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ వివాహ వేడుకలు జరిపిస్తూ చిక్కుల్లో పడుతున్నారు.. ఇటీవల శ్రీకాకుళంలోని ఓ టీచర్ పెళ్లి వేడుకకు ఏకంగా 250 మంది హాజరు కావడంతో.. పోలీసులు పెళ్లి కొడుక్కి రూ. 2 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జిల్లాలో మరో వివాహ వేడుకకు వచ్చిన అతిథులకు షాక్ ఇచ్చారు పోలీసులు.

శ్రీకాకుళం జిల్లా భామిని మండలంలోని తాలాడ గ్రామంలో ఓ వివాహ వేడుక చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చాలా మంది అతిథులు హాజరయ్యారు. అయితే వారంత మాస్కులు ధరించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఫంక్షన్లో సందడి చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు.. రెవెన్యూ అధికారులతోపాటు వెంటనే అక్కడకు చేరుకున్నారు. పరిమితికి మించి ఎక్కువ మంది అతిథులు హాజరుకావడం.. కరోనా నిబంధనలను ఉల్లంఘించడంతో అక్కడున్న వారిని మందలించారు. ఆ తర్వాత కరోనా నిబంధనలు అతిక్రమించినందుకు గానూ.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సహా ఫంక్షన్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. దీంతో వారంత ఒక్కసారిగా షాక్ తిన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే.. పెళ్లి వారి కుటుంబానికి జరిమానా విధించాలి గానీ.. అతిథులకు కూడా ఫైన్ వేస్తారా ? అంటూ కొందరు పోలీసులు, రెవెన్యూ అధికారులతో వాగ్యాదానికి దిగారు. నిబంధనలు అతిక్రమించిన ప్రతి ఒక్కరూ జరిమానా కట్టాల్సిందేనని తేల్చి చెప్పి దాదాపు 30 మంది దగ్గర రూ.వెయ్యి చొప్పున జరిమానా వసూలు చేశారు పోలీసులు.

Also Read: మరో గుర్తుండిపోయే ఐకానిక్ రోల్‏లో రామ్ చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ సినిమాలో సరికొత్త లుక్..