అమరావతి రీస్టార్ట్‌ సభ హైలైట్స్.. పవన్‌‌కు ప్రధాని మోదీ సర్‌ప్రైజ్ గిఫ్ట్..

అమరావతి రీలాంచ్‌ ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుత బహుమతిని మోదీకి అందజేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్. మోదీ ఫోటోతో అమరావతి రీలాంచ్‌ ఫ్రేమ్‌ను మోదీకి అందజేశారు. పవన్‌ స్పీచ్‌ అనంతరం సభావేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..

అమరావతి రీస్టార్ట్‌ సభ హైలైట్స్.. పవన్‌‌కు ప్రధాని మోదీ సర్‌ప్రైజ్ గిఫ్ట్..
Pawan Kalyan & Modi

Updated on: May 02, 2025 | 7:03 PM

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం అయ్యింది…! ఐదు కోట్లమంది ఆంధ్రుల ఆశ, ఆకాంక్షగా ఉన్న అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ఇక పరిగెత్తాలి రాజధాని… ఎలాంటి సహాయ సహకారాలైనా అందించడానికి సిద్ధం మీ ప్రధాని… అంటూ ఆంధ్రులు ఉప్పొంగేలా భరోసానిచ్చారు మోదీ.

అమరావతి రీస్టార్ట్‌ సభ దద్దరిల్లింది. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది సభకు తరలివచ్చారు. సీఎం చంద్రబాబుతో కలిసి మోదీ వేదికపైకి రాగానే నమో నమో అంటూ అరుపులతో ప్రజలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబుతో కలిసి ప్రజలకు మోదీ అభివాదం చేశారు. ప్రత్యేకంగా తయారు చేయించిన ధర్మవరం పట్టువస్త్రంతో మోదీని సత్కరించారు సీఎం చంద్రబాబు. సభా వేదికపై కూర్చున్న నేతలంతా నించుకుని చప్పట్లతో మోదీకి వెల్‌కమ్ చెప్పారు.

అమరావతి రీలాంచ్‌ ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుత బహుమతిని మోదీకి అందజేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్. మోదీ ఫోటోతో అమరావతి రీలాంచ్‌ ఫ్రేమ్‌ను మోదీకి అందజేశారు. పవన్‌ స్పీచ్‌ అనంతరం సభావేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రసంగాన్ని ముగించుకుని వెళ్తున్న పవన్‌ని పిలిచి మరీ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ ఇచ్చారు మోదీ. దీంతో పవన్‌తో పాటు పక్కనే ఉన్న చంద్రబాబు గొల్లున నవ్వారు. అసలేంటా గిప్ట్‌ అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఆ తర్వాత అసలు ఘట్టం ప్రారంభమైంది. వేదిక పైనుంచే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోదీ. 18 కీలక ప్రాజెక్టుల పనులను ప్రారంభించారు. మొదట శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని. ఆ తర్వాత ఏపీ హైకోర్టు నిర్మాణ పనులకు మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత HOD టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అనంతరం అమరావతి ట్రంక్‌ ప్రాజెక్ట్, 0.53 టీఎంసీల నీటి సామర్థ్యం గల మూడు జలాశయాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.

తెలుగులోనే ప్రసంగం మొదలుపెట్టారు మోదీ. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు… ఓ శక్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునికప్రదేశ్‌గా మార్చే శక్తి అన్నారు. అమరావతి అభివృద్ధిని తాను, చంద్రబాబు, పవన్‌ మాత్రమే చేయాలంటూ ఏపీ ప్రజలకు పెద్ద భరోసానిచ్చారు.