PM Modi: ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌.. తుఫాన్‌ల ప్రభావంపై ఆరా

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. ఇటీవల ఏపీపై అర్నబ్‌, మురసు తుఫాన్ల ప్రభావం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ల ప్రభావం, నష్టంపై వివరాలను అడిగారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించారు సీఎం చంద్రబాబు.

PM Modi: ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌.. తుఫాన్‌ల ప్రభావంపై ఆరా
Pm Modi Speaks To Chandrababu Naidu Over Cyclone Damage In Andhra

Updated on: Nov 04, 2026 | 1:29 PM

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. ఏపీపై అర్నబ్‌, మురసు తుఫాన్ల ప్రభావంపై ఆరా తీశారు. రాష్ట్రంలో తుఫాన్ల ప్రభావం, నష్టంపై అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించారు సీఎం చంద్రబాబు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో రైతులకు తీవ్ర నష్టం కలిగిందని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు తెలిపారు.

రహదారులు, విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లిందని.. తుఫాన్‌ నష్టాల నుంచి ఏపీ ఆదుకోవాలని ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రం తిరిగి కొలుకునేందుకు కేంద్రం తగిన సాయం అందించాలని కోరారు సీఎం. అంతేకాదు తుఫాన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సీఎం ప్రధానికి వివరించగా.. ఆయన ప్రశంసలు కురిపించారు.

ప్రభుత్వ పనితీరు అభినందనీయమన్నారు ప్రధాని మోదీ. నిరంతర అప్రమత్తతతో తుఫాను ప్రభావాన్ని.. సమర్థంగా అధిగమించారని చంద్రబాబును ప్రశంసించారు ప్రధాని మోదీ. అలాగే ఏపీకి కేంద్ర తరపున అందాల్సిన సహకరాన్ని అందిస్తామని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us