ప్లీజ్.. కరోనా లక్షణాలుంటే తిరుమలకు రావొద్దు!

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శననానికి వచ్చే భక్తలకు టీటీడీ కీలక సూచనలు చేసింది. కరోనా లక్షణాలుంటే.. దయచేసి తిరుమలకు రావొద్దంటూ విజ్ఞప్తి చేసింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడే భక్తులు దర్శనానికి వస్తే..

ప్లీజ్.. కరోనా లక్షణాలుంటే తిరుమలకు రావొద్దు!

Edited By:

Updated on: Mar 09, 2020 | 9:15 AM

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనానికి వచ్చే భక్తiలకు టీటీడీ కీలక సూచనలు చేసింది. కరోనా లక్షణాలుంటే.. దయచేసి తిరుమలకు రావొద్దంటూ విజ్ఞప్తి చేసింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడే భక్తులు దర్శనానికి వస్తే.. మిగిలిన భక్తులకు కూడా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని.. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే.. వెంటనే వారిని తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే భక్తులు తిరుమలకు వచ్చే ముందు శానిటైజర్లు, మాస్కులతో రావాలని సూచనలు జారీ చేసింది టీటీడీ. కాగా గత కొద్ది రోజులుగా.. కరోనా వైరస్ కారణంగా.. ఎంతో రద్దీగా ఉండే తిరుమల క్షేత్రంలో.. హడావిడి తగ్గింది. తిరుమలేశుడిని దర్శించుకోవడానికి 2 గంటల సమయం పడుతోంది.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మూడు వేల మందికి పైగా మరణించారు. చైనాలో తగ్గుముఖం పట్టిన ఈ వైరస్ మిగిలిన దేశాలలోనూ విజృంభిస్తోంది. అలాగే భారత్‌లో కూడా 43 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని, ముఖాలకు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అసలు టార్గెట్ దొరబాబు కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే!

Read More this also: ఆయన్ని కొడితే రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ.. ఆనందంలో రోజా!

Read More: మళ్లీ ప్రేమలో పడ్డ టాలీవుడ్ విలన్! ఈయనది 51.. ఆమెది 33

ఇది కూడా చదవండి: జగన్, చంద్రబాబులపై మంచు విష్ణు హాట్ కామెంట్స్..