Konaseema: పంది తెచ్చిన ప్రమాదం.. అరక్షణంలో అంతా జరిగిపోయింది.. షాకింగ్ వీడియో

|

Sep 03, 2022 | 10:01 AM

మనం జాగ్రత్తగానే వెళ్తూ ఉండవచ్చు. కానీ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేం. క్షణంలో ఫేట్ మారిపోతుంది. అలాంటి యాక్సిడెంట్ ఒకటి సీసీ టీవీలో రికార్డయ్యింది.

Konaseema: పంది తెచ్చిన ప్రమాదం.. అరక్షణంలో అంతా జరిగిపోయింది.. షాకింగ్ వీడియో
Bike Accident
Follow us on

Viral video: రోడ్డుపై వెళ్లేప్పుడు ఏ వైపునుంచైనా, ఏక్షణమైనా ప్రమాదం ముంచుకురావొచ్చు. మనం జాగ్రత్తగానే ఉన్నా.. భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో అలాంటిదే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా(B.R. Ambedkar Konaseema district )లో ఓ బైకర్‌కి సడన్‌గా పంది అడ్డం వచ్చింది. దాన్ని గమనించి బ్రేక్‌ వేసేలోపే యాక్సిడెంట్ జరిగిపోయింది. బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రి పాలయ్యాడు. అది మాత్రం లేచి నిదానంగా వెళ్లిపోయింది. రాజోలు మండలం కడలి గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఊళ్లో పదుల సంఖ్యలో పందుల స్వైర విహారం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేరంటున్నారు. ఉన్నపలంగా వచ్చి వాహనాలకు అడ్డంగా పడడంతో ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం