Fuel Prices: ఏపీలో అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి తెలుసా.. పూర్తి వివరాలు..

Fuel Prices:  ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇంధన ధరలు ప్రతి రోజు మారుతున్నాయి. రోజు ఉదయం 6 గంటలకు సవరించిన రేట్లుతో అమ్మకాలు జరుగుతాయి. ఈ రోజు ధరలు ఎక్కడ తగ్గాయో ఇప్పుడు తెలుసుకోండి.

Fuel Prices: ఏపీలో అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి తెలుసా.. పూర్తి వివరాలు..
Fuel Prices

Edited By: KVD Varma

Updated on: Mar 19, 2022 | 3:06 PM

Fuel Prices:  ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇంధన ధరలు ప్రతి రోజు మారుతున్నాయి. రోజు ఉదయం 6 గంటలకు సవరించిన రేట్లుతో అమ్మకాలు జరుగుతాయి. 2017 జూన్ 16 నుంటి డైనమిక్ ప్రైసింగ్(Dynamic Pricing) పద్ధతిలో చమురు ధరల్లో మార్పులు చేసే ప్రక్రియ అమలులో ఉంది. తగ్గిన ధరలను వినియోగదారులకు వెంటనే అందించాలని ఉద్ధేశంతో దీనిని ప్రవేశపెట్టారు. రేట్లలో మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇంధన కంపెనీలు యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ వివరాలను తమ వెబ్ సైట్లలో కూడా ఉంచుతున్నాయి. ఇవాళ్టి వివరాల ప్రకారం పెట్రోల్ ధరలు శ్రీకాకుళంలో నిన్న రూ.110.21గా ఉన్న ధర ఈరోజు రూ.109.83కి తగ్గింది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో  నిన్నరూ.110.13గా ఉన్న ధర 17 పైసలు తగ్గి రూ .109.96 వద్ద ఉంది. కర్నూలులో నిన్న రూ.110.07గా ఉన్న ధర ఈరోజు  రూ.109.88కి తగ్గింది. ఇదే సమయంలో తూర్పుగోదావరి, విశాఖ, ప్రకాశం, నెల్లూరుల్లో అర్ధ రూపాయికంటే ఎక్కువగానే పెట్రోల్ రేట్లు పెరిగాయి.

ఇక డీజిల్ ధరలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈరోజు కాస్త తగ్గాయి. మరికొన్ని ప్రాంతాలలో కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి.  తూర్పుగోదావరిలో నిన్న రూ.96.82 గా ఉన్న డీజిల్ రేటు ఈరోజు రూ.96.03కు తగ్గింది. శ్రీకాకుళంలో నిన్న రూ.96.26గా ఉన్న రేటు ఈరోజు రూ.95.90కి తగ్గింది. కృష్ణలో రూ.96.23 నుంచి ఈరోజు 96.08కి తగ్గింది. ఇదే సమయంలో.. విశాఖలో నిన్న రూ.95.41గా ఉన్న రేటు రూ.95.95కి పెరిగింది. శ్రీకాకుళంలో రేటు రూ.96.26 నుంచి రూ.95.90కి పెరిగింది. ప్రకాశంలో రూ.96.15గా ఉన్న రేటు ఈరోజు రూ.96.76కి పెరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో డీజిల్ ధరల్లో చాలా స్వల్ప మార్పులు వచ్చాయి.

ఇవీ చదవండి..

AP: పవన్ తలతిక్కగా మాట్లాడారు అంటూ నారాయణ కామెంట్.. మీ ఓట్ల లెక్కలు తెలుసుకోండి అంటూ జనసేన కౌంటర్

Zelensky: అసోంలో మార్మోగుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేరు.. విషయం ఏంటంటే..