పెంపుడు జంతువులు అంటే కుటుంబ సభ్యులకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా పెంపుడు కుక్కలు అంటే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరుగా భావించి ప్రేమించేవారు ఉంటారు. అలా ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కపై ఏనలేని మమకారం పెంచుకుంది.. కన్న బిడ్డల కంటే ప్రేమగా దానిని చూసుకునేవారు. అంతేకాదు ఫ్యామిలీ ప్రతి ఏడాది తమ పెంపుడు శునకం పుట్టిన రోజును ఘనంగా జరుపుతున్నారు. అంతేకాదు బంధువులు,స్నేహితుల సమక్షంలో చేస్తూ కేక్ కట్ చేసి తమ కుక్క పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తున్నారు.
సాధారణంగా పిల్లలు ,పెద్దలు పుట్టిన రోజులు ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉంటాం. వీటికి భిన్నంగా ఈ మధ్య కాలంలో పెంపుడు జంతువుల పుట్టిన రోజు వేడుకలు కుడా మనుషులతో సమానంగా చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడది కూడా ట్రెండ్ అయింది.
తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ ఫ్యామిలీ పెంపుడు కుక్కలు పుట్టిన రోజు వేడుకలు చేసింది. అది కూడా చాలా ప్రత్యేకంగా తమ కుక్క రూమ్ ను డెకరేట్ చేశారు. తమ శునకానికి కొత్త బట్టలు నగలతో అలంకరించి మరి కేక్ కట్ చేశారు. పెంపుడు కుక్క పప్పి కి వినూత్న రీతిలో ఆ ఫ్యామిలీ చేసిన పుట్టిన రోజు వేడుకల్లో తన హాస్పిటల్ లో కుక్క యజమాని డాక్టర్ శివ కృష్ణ ప్రసాద్ పనిచేసే స్టాఫ్, స్నేహితుల అందరు పాల్గొన్నారు. 2019 నుంచి తన పెంపుడు కుక్క (పప్పి) కి పుట్టినరోజు వేడుకలు చేస్తున్న శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. తమ పప్పిని తమ కుటుంబ సభ్యుడుగా భావించి పుట్టిన రోజు వేడుకలు చేస్తాం అంటున్నారు. మరో పక్క కుక్క కి పుట్టినరోజు వేడుకలు చేయడం పై నందిగామలో ప్రజలు వింతగా చర్చించుకుంటున్నారు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..