విజయవాడ నుంచి మచిలీపట్నానికి వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. వారాహిలో ఆటోనగర్ నుంచి ర్యాలీగా బయల్దేరిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఆటోనగర్, తాడిగడప జంక్షన్, పోరంకి, పెనమలూరు, పామర్రు – గుడివాడ సెంటర్, గూడూరు మీదుగా మచిలీపట్నం సభాప్రాంగణానికి పవన్ చేరుకోనున్నారు. ఈ తరుణంలో విజయవాడ – మచిలీ పట్నం హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు వారాహి ముందు 2 పోలీస్ వాహనాలతో పవన్ ర్యాలీని వేగంగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో కీలక సన్నివేశం చోటుచేసుకుంది. వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ అంబులెన్స్ కి దారిచ్చి మానవత్వం చాటుకున్నారు.
ఇసుకేస్తే రాలనంత మంది జనసేన శ్రేణులు, ప్రజలు వెంట తరలిరాగా వారాహి యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుండగా.. ఈ సన్నివేశం జరిగింది. మార్గమధ్యంలో పెనమలూరు నియోజకవర్గం, ఈడ్పుగల్లు వద్ద అత్యవసర సర్వీసు అయిన అంబులెన్స్ వాహనాల మధ్య చిక్కుకుపోవడంతో… వారాహిని పది నిమిషాలు నిలిపివేసి ఆంబులెన్స్ కి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దారిచ్చారు. అంబులెన్స్ ముందుకు వెళ్లిపోయిన తర్వాత వారాహి యాత్ర కొనసాగింది. దీంతో మానవతావాదిగా పవన్ కళ్యాణ్ మరోసారి రుజువు చేసుకున్నారంటూ అభిమానులు కొనియాడుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..