Pawan Kalyan: రియల్ గన్ పట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్

సినిమాల్లో తుపాకీ పేల్చడాలు కామన్‌గానే ఉంటాయి. కానీ ఈసారి నిజ జీవితంలోనే గన్ను పేల్చి ఓజీ ఫీలింగ్‌ రియల్ గానూ చూశారు పవన్‌కల్యాణ్‌. తాడేపల్లిలోని పోలీస్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో గ్లాక్‌ పిస్టల్‌తో రౌండ్లు ఫైర్‌ చేస్తూ రియల్‌ లైఫ్‌ గన్‌స్టర్‌గా మారిపోయారు డిప్యూటీ సీఎం.

Pawan Kalyan: రియల్ గన్ పట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan

Updated on: Nov 09, 2025 | 9:01 PM

నాట్‌ఓన్లీ ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్‌లో కూడా ఓజీనే. రీల్‌ లైఫ్‌లో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌ని, రియల్‌ లైఫ్‌లో ఒరిజినల్‌ గన్‌స్టర్‌ని.. గన్ను వాడ్డం మొదలుపెడితే నాకంటే ఎవ్వడూ బాగా వాడలేడు.. అంటున్నారు పవర్‌స్టార్ కమ్‌ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. తాడేపల్లిలోని నులకపేట సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫైరింగ్ రేంజ్‌ని విజిట్ చేశారు పవన్‌. అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఫైరింగ్ ప్రొసీజర్స్‌ని అడిగి తెలుసుకున్నారు. ఫైర్‌ ఆర్మ్‌ ఎలా హ్యాండిల్ చేయాలి.. టార్గెట్‌కు ఎలా గురిపెట్టాలి.. అని ఆరా తీశారు. అలాగని థియరీతో సరిపెట్టుకోలేదు. ప్రాక్టికల్‌గానూ ట్రై చేశారు.

నేషనల్ రైఫిల్‌ అసోసియేషన్‌లో మెంబర్‌గా రైఫిల్‌తో నాకూ కొంచెం ప్రాక్టీసుంది. ఆ అనుభవంతోనే గ్లాక్ 0.5 పిస్టల్‌తో కొన్ని రౌండ్లు ఫైర్ చేశా.. వెపన్‌ మెయింటెనెన్స్‌ మజానిచ్చింది అంటూ తన ఎక్స్‌పీరియన్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు పవన్. సినిమాల్లో షూటౌట్లు కామన్. తుపాకీ తిప్పడాలు- బుల్లెట్లు పేల్చడాలు కూడా అలవాటే. కానీ, ఇది అంతకుమించి ఫీల్‌నిచ్చింది. ధ్యాసతో కూడిన ధ్యానముద్రలా అనిపించింది.. అంటున్నారు ఓజీ. మద్రాస్ రైఫిల్ క్లబ్‌లో గన్ను పేల్చినప్పటి చెన్నై డేస్ గుర్తుకొస్తున్నాయ్ అని నోస్తాల్జీ ఫీలయ్యారు పీకే. రియల్‌ ఓజీ ఆగయా అంటూ పవన్ ఫ్యాన్స్ కూడా ఫుల్‌ఖుష్ ఔతున్నారు.