JanaSena Public Meeting: జనసేన అధినేత పవన్‌కల్యాన్ ఫోకస్ ఇప్పుడు ఉత్తరాంధ్రపై పడింది. ఇవాళ్టి నుంచి 10 రోజుల పాటు ఆయన వారాహియాత్రను ఉత్తరాంధ్రలో చేపడుతున్నారు. అయితే యాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు. ముందుగా నిర్ణయించిన దారిలో కాకుండా మరో దారిలో వెల్లాలని సూచించారు. ఎక్కడా రోడ్‌షోలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. అయితే ఈ సాయంత్రం జగదాంబ కూడలిలో జరిగే సభకు మాత్రం పోలీసులు అనుమతి ఇచ్చారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాలను సందర్శిస్తారు పవన్‌కల్యాన్. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపనున్నారు. వారాహి యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు నియమించింది జనసేన పార్టీ. మాజీ మంత్రి పడాల అరుణ జనసేనలో చేరారు. జనసేన ఆశయాలు అర్ధం చేసుకుని వచ్చేవారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామన్నారు పవన్‌కల్యాన్. కాసేపట్లో జగదాంబ సెంటర్ నుంచి జనసేన వారాహి యాత్ర స్టార్ట్ కానుంది. జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసే సభలో ప్రసంగిస్తారు పవన్. ఆ తర్వాత జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు.
అంతకుముందు విశాఖపట్నం చేరుకున్న పవన్‌కల్యాన్‌కు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళ నేతలు.. హారతులు పట్టారు. ర్యాలీలు చేయొద్దు, అభివాదాలకు ఆస్కారం లేదు, డ్రోన్ కెమెరాలను వినియోగించొద్దంటూ పలు ఆంక్షలు విధించిన పోలీసుల తీరుపై జనసేన మండిపడుతోంది.
వారాహి యాత్రలో తొలి రెండు విడతలు ఉభయ గోదావరి జిల్లాలో నిర్వహించారు. మూడో విడత ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో జరుపుతున్నారు. 14వ తేదీ వరకు విశాఖపట్నంలోనే ఉంటారు పవన్‌కల్యాన్. 15,16 తేదీల్లో గ్యాప్ ఇచ్చి 17వ తేదీ నుంచి మళ్లీ యాత్రను కంటిన్యూ చేస్తారు.