Janasena: తొలి ఎమ్మెల్యే అభ్యర్ధిని ప్రటించిన జనసేన.. ఆ నేత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారంటే..?

|

Aug 02, 2023 | 2:17 PM

Janasena: పార్టీ తరఫున విజయ కేతనం ఎగరవేసే నాయకులనే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలని వైసీపీ, టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల సమీక్షలు కూడా జరుపుతున్నాయి. ఇలాంటి సమయంలోనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని..

Janasena: తొలి ఎమ్మెల్యే అభ్యర్ధిని ప్రటించిన జనసేన.. ఆ నేత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారంటే..?
Pawan Kalyan And Nadendla Manohar
Follow us on

Janasena: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సర కాలమే ఉండడంతో రాష్ట్ర రాజీయాలు ఊపందుకుంటున్నాయి. పార్టీ తరఫున విజయ కేతనం ఎగరవేసే నాయకులనే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలని వైసీపీ, టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల సమీక్షలు కూడా జరుపుతున్నాయి. ఇలాంటి సమయంలోనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. 2018 నాటి నుంచి జనసేన పార్టీకే అంకితమై తన వంతు సేవలందిస్తున్న మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్‌ తెనాలి నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాన్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్‌ నాదేండ్ల మనోహర్‌ని గెలిపించం ఎంతో అవసరమని తెనాలి నాయకులకు జనసేనాని సూచించారు.

ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తులతోనే బరిలోకి దిగుతుందన్న ప్రచారం కొనసాగుతోన్న నేపథ్యంలో, పవన్ తన పార్టీ నుంచి పోటీ చేసే తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించి అన్ని పార్టీలకు షాక్ ఇచ్చారు. మరోవైపు నాదేండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం నుంచే 2004, 2009 కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కూడా ఆయన తెనాలి నుంచే బరిలోకి దిగి ఓటమిని చవిచూశారు.

ఇవి కూడా చదవండి