Corona Effect: ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వుల మేరకు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి పాక్షికంగా లాక్‌డౌన్ విధించనున్నారు. లాక్‌డౌన్‌కు సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని రకాల షాపులకు అనుమతించారు. ప్రజా రవాణాకు సైతం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతించారు. 12 గంటల తరువాత అత్యవసర సేవలు మినహా అన్నింటిపై ఆంక్షలు విధించారు. కిరాణా దుకాణాలు, రవాణాపై ఆంక్షలు పెట్టారు. ఇదిలాఉంటే.. జిల్లా వ్యాప్తంగా రెండు వారాల పాటు 144 సెక్షలు అమలు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతించారు. కాగా, ఈ ఆంక్షల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా బుధవారం నుంచి గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్న 13 రైతు బజార్లతో పాటు.. అనదనంగా మరో 33 మినీ రైతుబజార్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
అలాగే బుధవారం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలైన సింహాచలం అప్పన్న, కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఉదయం 6.30 నుంచి 11.30 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనాలకు అనుమతిస్తున్నట్లు అధికారులు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సయమంలో విశాఖ ఏజెన్సీ పరిధిలోని పర్యాటక కేంద్రాలన్నింటిని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బొర్రా గుహలు, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్ ఇవాళ్టి నుంచి మూతపడనున్నాయి. ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్‌లో సందర్శకుల ప్రవేశాలను మంగళవారం నుంచే నిలిపివేశారు అధికారులు.
Also read:
Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు