ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా(Corona) మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టాం. స్పేస్‌లో అద్భుతాలు చేస్తున్నాం. కానీ కొంతమంది నుంచి మూఢనమ్మకాలను మాత్రం వేరు చేయలేకపోతున్నాం. జ్వరం వస్తే భూత వైద్యుడు దగ్గరికి వెళ్లేవాళ్లని.. సిరులు కలిసి రావాలని మాంత్రికుల దగ్గరకి వెళ్లేవాళ్లని ఇప్పటికీ మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. ఇక చేతబడి, బాణామతి బ్యాచ్ కూడా సైలెంట్‌గా తమ పని తాము చేసుకుపోతూ ఉంటుంది. తాజాగా బాపట్ల జిల్లా(Bapatla Distric) సంతమాగులూరు(Santhamaguluru) మండలం ఏల్చూరు, సజ్జాపురం గ్రామాల మధ్య రోడ్డుపై క్షుద్ర పూజల కలకలం రేపాయి. రెండు రోడ్లు కలిసే చోట పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, చిన్న పిల్లల దుస్తులు ఉంచి.. ముగ్గు వేశారు దుండగులు. పొలాలకు వెళ్లే దారి కావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోడ్డుపై ముగ్గువేసి అందులో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉండటంతో పాటు ముగ్గులో చిన్న పిల్లల దుస్తులు ఉండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో చిన్నారిపై చేతబడి చేసి ఉంటారని కొంతమంది గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ది చెందిన ఈ రోజుల్లో కూడా చేతబడి, బాణామతి వంటి క్షుద్రపూజులు పనిచేస్తాయని నమ్ముతున్న కొంతమంది అంధ విశ్వాసం కలవాళ్ళు ఈ పనిచేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ క్షుద్రపూజల గురించి కొంతమంది గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామాల్లో ఇలాంటి చేష్టలు చేసి.. భయబ్రాంతులకు గురిచేసేవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
—ఫైరోజ్, టీవీ9 తెలుగు, ఒంగోలు
Also Read: Kadapa: షాకింగ్ ఇన్సిడెంట్.. ఛార్జింగ్ పెట్టి వర్క్ చేస్తుండగా ల్యాప్‌టాప్ బ్లాస్ట్.. పాపం యువతి