బకెట్లు, బిందెలతో బయటకు వచ్చిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..!

అద్దంకి నార్కెట్ పల్లి హైవేలో కోటనెమలిపురి గ్రామం వద్ద వేగంగా వస్తున్న లారీ ఒక్కసారి అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. దీంతో స్థానికులు లారీలో ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో లారీలో నుండి ఆయిల్ బయటకు రావడం ప్రారంభమైంది. ముందు స్థానికులు భయపడ్డారు. అయితే లీక్ అవుతుంది పెట్రోల్, డీజిల్ కాదని అర్ధమైంది. లారీ ట్యాంకర్‎లో ఉన్న పామాయిల్ లీక్ అవుతున్నట్లు ఆలస్యంగా తెలుసుకున్నారు. అయితే అప్పటికే హైవే‎పై వాహనాలు నిలిచిపోవడం మొదలైంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరిపోయింది.

Oil Tanker

Edited By:

Updated on: Jun 19, 2024 | 5:08 PM

అద్దంకి నార్కెట్ పల్లి హైవేలో కోటనెమలిపురి గ్రామం వద్ద వేగంగా వస్తున్న లారీ ఒక్కసారి అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. దీంతో స్థానికులు లారీలో ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో లారీలో నుండి ఆయిల్ బయటకు రావడం ప్రారంభమైంది. ముందు స్థానికులు భయపడ్డారు. అయితే లీక్ అవుతుంది పెట్రోల్, డీజిల్ కాదని అర్ధమైంది. లారీ ట్యాంకర్‎లో ఉన్న పామాయిల్ లీక్ అవుతున్నట్లు ఆలస్యంగా తెలుసుకున్నారు. అయితే అప్పటికే హైవే‎పై వాహనాలు నిలిచిపోవడం మొదలైంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరిపోయింది.

ఇంతలోనే స్తానికులు ఇంట్లో ఉన్న బకెట్లు, బిందెలు తీసుకోని రోడ్డుపైకి వచ్చారు. లారీ ట్యాంకర్ నుండి లీక్ అవుతున్న పామాయిల్ పట్టుకునేందుకు క్యూకట్టారు. అంతేకాకుండా ఒకరొనొకరి నెట్టుకుంటూ ట్యాంకర్‎పైకి ఎగబడ్డారు. వంట నూనెల ధరలు మండిపోతుండటంతో వచ్చిన కాడికి పట్టుకునే ప్రయత్నం చేశారు స్థానికులు. అయితే కొద్దిసేపటికే పోలీసులు అక్కడికి చేరుకొని అందరిని పంపించారు. నెల్లూరు నుండి హైదరాబాద్‎లోని ఫ్యాక్టరీకి పామాయిల్ తీసుకెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి కారణం ట్యాంకర్ డ్రైవర్ నిద్ర మత్తు అని ప్రాధమికంగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..