ఇవాళ ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఆ మహానాయకుడిని స్మరించుకుంటున్నారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్‌కి వళ్లి నివాళులు అర్పిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఉదయాన్నే ఘాట్‌కి వెళ్లారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. రాజకీయంగా, సామాజికంగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న అన్నగారు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని బాలకృష్ణ అన్నారు. బాలయ్యతోపాటు సుహాసిని, రామకృష్ణ కూడా ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించారు. అటు.. బాలయ్య కంటే ముందే తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. నందమూరి తారకరామారావు ఘాట్‌కి వెళ్లారు. తాతయ్య సమాధిపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. వీరి రాక సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు.
దేశంలో సంక్షేమపాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.
ఇవి కూడా చదవండిఒకే ఒక జీవితం… రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు. తెలుగునాట నిరుపేదకు అలనాటి… pic.twitter.com/GMZLLHM8Jb
— N Chandrababu Naidu (@ncbn) January 18, 2024
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మహానాయకుడు ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా గుడివాడలో ‘రా.. కదలిరా’ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తన ట్విట్టర్ వేదికగా ఒకే జీవితం.. రెండు తిరుగులేని చరిత్రలు అని రాసుకొచ్చారు చంద్రబాబు. హైదరాబాద్ లో కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పిస్తే ఇటు.. విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు ఆయన కుమార్తె పురంధేశ్వరి. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ప్రభంజనమని అన్నారు. సంక్షేమం అనే పదానికి మారు పేరుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నందమూరి తారకరామారావుకు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఎన్టీఆర్ కి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఆయన పేదల పాలిట మహానుభావుడు అని కీర్తించారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీంతో విజయవాడ ప్రతి వాడల్లో ఎన్టీఆర్ వర్ధంతికి ఫెక్సీలు ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..