APSRTC: ఆర్టీసీ అధికారుల వింత ఆదేశాలు.. కేఎంపీఎల్ ​తక్కువొచ్చిందని నోటిసు జారీ..

|

May 17, 2022 | 4:05 PM

తెలంగాణ ఆర్టీసీ(TSRTC) అధికారులే కాదు.. ఆంధ్రా ఆర్టీసీ అధికారులు కూడా వింతగా ప్రవర్తిస్తున్నారు. ఆ మధ్య తెలంగాణలో ఓ ఆర్టీసీ కార్మికుడు మా బంధువు చనిపోయాడు సెలవు ఇవ్వండి అంటే..

APSRTC: ఆర్టీసీ అధికారుల వింత ఆదేశాలు.. కేఎంపీఎల్ ​తక్కువొచ్చిందని నోటిసు జారీ..
Rtc
Follow us on

తెలంగాణ ఆర్టీసీ(TSRTC) అధికారులే కాదు.. ఆంధ్రా ఆర్టీసీ అధికారులు కూడా వింతగా ప్రవర్తిస్తున్నారు. ఆ మధ్య తెలంగాణలో ఓ ఆర్టీసీ కార్మికుడు మా బంధువు చనిపోయాడు సెలవు ఇవ్వండి అంటే.. శవంతో సెల్ఫీ తీసి పెట్టమన్నాడట ఓ అధికారి. ఇక లీటరు డీజిల్‌కు తిరగాల్సిన కిలోమీటర్లు(కేఎంపీఎల్‌) తగ్గాయని రూ.10 వేలు జీతంలో ఎందుకు కోత విధించరాదో వివరణ కోరుతూ డిపో మేనేజర్‌ బస్సు డ్రైవర్‌కు నోటిసు ఇచ్చారు మరో అధికారి. ఇలానే ఏపీలోని సింహాచలం ఆర్టీసీ(APSRTC) డిపో అధికారులు వింత ఆదేశాలు జారీ చేశారు. 6 కిలోమీటర్లు రావాల్సిన లీటర్ డీజిల్(diesel ) 5.16 కిలోమీటర్లు మాత్రమే వచ్చిందని ఆ నష్టాన్ని మీ జీతం నుంచి ఎందుకు వసూలు చేయకూడదో చెప్పాలంటూ డ్రైవర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. డిపో మేనేజర్ నోటీస్‌లు చూసి ఆర్టీసీ కార్మికులు ఆశ్చర్యపోయారు.

కండిషన్‌లో లేని బస్సులు, పెరిగిన ట్రాఫిక్, సిగ్నల్స్ వద్ద వెయిటింగ్, రహదారుల మరమ్మత్తులు పరిగణలోకి తీసుకోకుండా నోటీస్‌లు ఎలా ఇస్తారని కార్మిక సంఘాలు నిలదీశాయి. కార్మిక సంఘాల హెచ్చరికలతో నోటీసులు వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటన చేసింది. అలాంటి నోటీసులు ఇస్తే చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్లకు అడ్మిన్ ఈడీ హెచ్చరిక జారీ చేశారు. ఎక్కువ కలెక్షన్‌(ఆదాయం) తీసుకురాకపోతే కండక్టర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా అని ప్రతి దగ్గర ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటే.. డ్రైవర్‌ కండక్టర్‌పై కస్సుమంటున్నాడు. ఇలా ఎక్కడపడితే అక్కడ ఆపుతూ పోతే డీజిల్‌ వ్యయం ఎక్కువవుతోందని.. దీంతో తాను డిపోలో చీవాట్లు తినాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి…