Jurala Dam: జురాల ప్రాజెక్ట్‌కు ప్రమాదం పొంచి ఉందా?.. ప్రాజెక్ట్ పైనుంచి రాకపోకలను నిలిపివేయనున్నారా?

కృష్ణా నది (Krishna River).. రెండు తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తున్న మహా నది. మహారాష్ట్రలో పుట్టిన కృష్ణవేణి.. తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్ లోని హంసలదీవి వద్ద సాగరంలో అంతర్లీనమవుతోంది. ఈ నదిపై..

Jurala Dam: జురాల ప్రాజెక్ట్‌కు ప్రమాదం పొంచి ఉందా?.. ప్రాజెక్ట్ పైనుంచి రాకపోకలను నిలిపివేయనున్నారా?
Jurala Project
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 3:56 PM

కృష్ణా నది (Krishna River).. రెండు తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తున్న మహా నది. మహారాష్ట్రలో పుట్టిన కృష్ణవేణి.. తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్ లోని హంసలదీవి వద్ద సాగరంలో అంతర్లీనమవుతోంది. ఈ నదిపై ఎన్నో రకాల ప్రాజెక్టులు నిర్మితమయ్యాయి. భారతదేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టులయిన నాగార్జునసాగర్, శ్రీశైలం ఈ నది పైనే ఉన్నాయి. అయితే వీటికి ముందే కృష్ణమ్మ పై జూరాల ప్రాజెక్టును నిర్మించారు. అయితే జురాల ప్రాజెక్ట్‌కు (Jurala Project) ప్రమాదం పొంచి ఉందా? ప్రాజెక్ట్ పైనుంచి రాకపోకలను నిలిపివేయనున్నారా? ఇదే ఇప్పుడు స్థానికులకు టెన్షన్‌ కలిగిస్తోంది. అసలు జురాల ప్రాజెక్ట్‌ వద్ద ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ (Mahabubnagar) జిల్లాలో కృష్ణానదిపై నర్మించిన తొలి ప్రాజెక్ట్‌ జురాల. 1985లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ ఇప్పుడు ప్రమాదంలో పడుతోంది. భారీ వాహనాల రాకపోకలతో జురాల ఆనకట్ట దెబ్బతింటోంది. ఈ విషయాన్ని జలాశయాల భద్రతా సమీక్ష కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. జురాల ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉందంటూ నివేదిక సమర్పించింది. ఆనకట్టపై వాహనాల రాకపోకలను వెంటనే నిలిపివేయాలని కోరింది. లేకపోతే ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ విషయం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులను కలవరపెడుతోంది. జురాల ప్రాజెక్టు బ్రిడ్జ్‌పై నుంచి రాకపోకలను నిలిపివేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ప్రభుత్వం ఇప్పుడే స్పందించి, ప్రత్యామ్నాయంగా మరో వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. కాగా.. 2019 వరదల్లో ప్రాజెక్టు పూర్తి గేట్లు ఎత్తడంతో ఆనకట్ట దిగువ భాగంతో ప్యారాపెట్‌ వాల్‌ కూలిపోయింది. కట్టపై నుంచి గ్యాలరీ ప్రదేశం పూర్తిగా మట్టితో నిండిపోయింది. దీనివల్లే కట్టకు ప్రమాదం పొంచి ఉందంటున్నారు నిపుణులు. ఆనకట్టకు స్వల్ప మరమ్మతులు చేపట్టినప్పటికీ, పూర్తిస్థాయి రిపేర్లు మాత్రం జరగలేదు. 1995 నుంచి అందుబాటులోకి వచ్చిన జురాల ప్రాజెక్ట్‌ దగ్గర నిర్వహణ మినహా చెప్పుకోదగ్గ మరమ్మతులు చేయలేదనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు, నిపుణుల కమిటీ రిపోర్ట్‌తో మరమ్మతులు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!