Obulapuram Mines: ఓఎంసీ కేసులో రాయదుర్గం కోర్టు సంచలన తీర్పు.. శ్రీనివాస్‌రెడ్డికి మూడేళ్ల జైలు శిక్ష..

|

May 21, 2022 | 9:38 AM

Obulapuram Mines: అక్రమార్కులను ఓబుళాపురం మైనింగ్‌ కేసులు వెంటాడుతున్నాయ్‌. పదేళ్ల క్రితం దేశంలోనే సంచలనం రేపిన ఓబుళాపురం మైనింగ్‌..

Obulapuram Mines: ఓఎంసీ కేసులో రాయదుర్గం కోర్టు సంచలన తీర్పు.. శ్రీనివాస్‌రెడ్డికి మూడేళ్ల జైలు శిక్ష..
Obulapuram
Follow us on

Obulapuram Mines: అక్రమార్కులను ఓబుళాపురం మైనింగ్‌ కేసులు వెంటాడుతున్నాయ్‌. పదేళ్ల క్రితం దేశంలోనే సంచలనం రేపిన ఓబుళాపురం మైనింగ్‌ కేసులో సంచలన తీర్పిచ్చింది రాయదుర్గం కోర్టు. ఓఎంసీ ఎండీ శ్రీనివాస్‌రెడ్డికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది. ఓబుళాపురం గనుల్లో తనిఖీలకు వచ్చిన అధికారులను అడ్డుకున్న కేసులో ఈ జడ్జిమెంట్‌ ఇచ్చింది రాయదుర్గం సివిల్‌ కోర్టు. 2008లో ఈ ఇన్సిడెంట్‌ జరిగింది. ఓబుళాపురం గనుల్లో అనుమతికి మించి అక్రమంగా ఐరన్‌ ఓర్‌ తవ్వుతున్నారని, అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు రావడంతో అటవీ అధికారులు చెకింగ్‌కి వెళ్లారు. గనుల సరిహద్దులను తేల్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఫారెస్ట్‌ అధికారులను అడ్డుకున్న ఓఎంసీ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి, విధులకు ఆటంకం కలిగించాడు. అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఆనాడు ఈ ఇన్సిడెంట్‌ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అటవీ అధికారులు పోలీసులకు కంప్లైంట్‌ చేయడంతో ఓఎంసీ ఎండీ శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదుచేసి ఛార్జిషీట్‌ ఫైల్‌ చేశారు. సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో ఎంతోమంది సాక్షులను విచారించింది కోర్టు. దాదాపు పద్నాలుగేళ్ల విచారణ తర్వాత, ఓఎంసీ ఎండీ శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా తేల్చిన రాయదుర్గం సివిల్‌ కోర్టు, మూడేళ్లపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2008లో జరిగిన ఈ ఇన్సిడెంట్‌ తర్వాతే, ఓబుళాపురం మైనింగ్‌లో అక్రమాల గుట్టు కదిలింది. 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్నాటకలో రాజకీయ దుమారం రేపింది. ఓఎంసీ కేసుల్లో ఎంతోమంది ప్రముఖులు ఇరుక్కుని ఇబ్బందులు పడ్డారు.