AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: రంజుగా నూజివీడు రాజకీయం.. వైసీపీలో త్రిముఖ పోరు తప్పేలా లేదుగా.!

నూజివీడు వైసీపీ అభ్యర్థి ఎవరు? సిట్టింగ్‌కి సీటు పదిలమేనా? టీడీపీని వీడి వైసీపీ వైపు అడుగులేస్తోన్న సీనియర్‌కు అవకాశమిస్తారా? సీఎం జగన్‌తో ఆశావహులంతా భేటీలవుతున్నా.. అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేదు. ఇంతకీ.. అధిష్ఠానం వ్యూహమేంటి? స్కెచ్చేంటి?

YSRCP: రంజుగా నూజివీడు రాజకీయం.. వైసీపీలో త్రిముఖ పోరు తప్పేలా లేదుగా.!
Ap Ysrcp
Ravi Kiran
|

Updated on: Feb 20, 2024 | 9:00 AM

Share

నూజివీడు వైసీపీ అభ్యర్థి ఎవరు? సిట్టింగ్‌కి సీటు పదిలమేనా? టీడీపీని వీడి వైసీపీ వైపు అడుగులేస్తోన్న సీనియర్‌కు అవకాశమిస్తారా? సీఎం జగన్‌తో ఆశావహులంతా భేటీలవుతున్నా.. అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేదు. ఇంతకీ.. అధిష్ఠానం వ్యూహమేంటి? స్కెచ్చేంటి?

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నాయి. అయితే సీటు ఆశించి భంగపడ్డ నేతల్లో కొంతమంది అలకబూనితే మరికొందరు పక్కచూపులు చూస్తున్నారు. ఈ కోవలోకే చేరారు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు. గత పదేళ్లుగా టీడీపీలో ఉన్న ఆయన.. మొన్నటిదాకా నూజివీడు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఈసారి టికెట్ తనకేనని ధీమాగా ఉన్నారు. ఆల్‌ ఆఫ్ సడెన్‌గా అధినేత టికెట్ లేదని చెప్పడంతో షాకయ్యారాయన. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే పార్థసారథిని నూజివీడు ఇన్‌ఛార్జ్‌గా నియమించింది టీడీపీ. ఈ పరిణామంతో షాకైన ముద్దరబోయిన తనకు చంద్రబాబు అన్యాయం చేశారంటూ.. ఆత్మీయ సమావేశంలో కన్నీటిపర్యంతమయ్యారు. ఆ తర్వాత పార్టీ మారాలని నిర్ణయం తీసుకోవడం.. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో వైవీ సుబ్బారెడ్డితో కలిసి సీఎంతో భేటీ కావడం చకాచకా జరిగిపోయాయి. అంతకుముందు నూజివీడు సిట్టింగ్ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్‌ అప్పారావు ఆయన తనయుడితో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. ఈ భేటీ దాదాపు 15నిమిషాల పాటు సాగింది. అయితే ఇద్దరిలో నూజివీడు బరిలో ఎవరుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మిగిలిపోయింది.

నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతాప్ అప్పారావు లేదంటే ఆయన కొడుకు బరిలోకి దిగడం ఖాయమని అనుకున్నారంతా. అయితే అనూహ్యంగా ముద్దరబోయిన వైసీపీలో చేరడంతో నూజివీడులో ఎవరు పోటీ చేస్తారనే ఆసక్తి నెలకొంది. సామాజిక, రాజకీయ సమీకరణాలతో ముద్దరబోయినకు అవకాశమిస్తారా? లేదంటే మరో రకంగా న్యాయం చేస్తామని హైకమాండ్‌ హామీ ఇస్తుందా అన్నది చూడాలి. సీఎంతో భేటీ తర్వాత ఎవరితో మాట్లాడకుండా వెళ్లిపోయిన ముద్దరబోయిన త్వరలో వైసీపీలో చేరికకు ముహూర్తం చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. నూజివీడు బరిలో ఎవరుంటారనే చర్చ జోరందుకుంది. ప్రతాప్‌కి మరోసారి ఛాన్స్ ఇస్తారా? ముద్దరబోయిన వైపు మొగ్గుచూపుతారా? నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పేరును ఇప్పటిదాకా ప్రకటించకపోవడం వ్యూహాంలో భాగమేనన్న ప్రచారం నడుస్తోంది. టీడీపీకి అసలు సిసలు అభ్యర్థిని నిలపాలన్న ఆలోచనతో ఉంది అధిష్టానం. ఆ క్యాండెట్‌ ఎవరన్నది తేలాలంటే వెయిట్ చేయాల్సిందే.