Bapatla: చేపల కోసం వల వేసిన జాలరి.. అందులో చిక్కింది చూసి స్టన్.. 1 కాదు, 2 కాదు ఏకంగా 10…

|

Nov 09, 2022 | 6:07 PM

ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. పాపం ఆ జాలరికి నిజంగా బ్యాడ్ డే. సంబరపడిపోయినంతసేపు పట్టలేదు.. ఆ సంతోషం ఆవిరవ్వడానికి.

Bapatla: చేపల కోసం వల వేసిన జాలరి.. అందులో చిక్కింది చూసి స్టన్.. 1 కాదు, 2 కాదు ఏకంగా 10...
Fishing (Representative image)
Follow us on

అతడో జాలరి. చేపల పట్టడం అతడి వృత్తి. డైలీ దగ్గర్లోని చెక్ డ్యాం వద్దకు వెళ్లి చేపలు పట్టి.. వాటి అమ్ముకోని జీవనం సాగిస్తున్నాడు. కానీ బుధవారం మాత్రం వింత అనుభం ఎదురైంది. ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం పవిడిపాడు చెక్‌డ్యాంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు స్థానిక జాలరి. ఎప్పట్లానే వల వేశాడు. బయటకు లాగుదామని ప్రయత్నంచగా వల బాగా బరువుగా అనిపించింది. అబ్బబ్బా.. గట్టి చేపలు పడ్డటున్నాయ్. ఈ రోజు పండగే అనుకున్నాడు. ఎంతో ఆశతో బలంగా ఆ వలను బయటకు లాగాడు. కానీ ఆ వలలో చిక్కినవి చూసి అతడి గుండె గల్లంతయ్యింది. ఎందుకంటే.. ఆ వలలో ఉన్నవి చేపలు కాదు.. పాములు. అది కూడా ఒకటీ, రెండూ కాదు. దాదాపు పది పాములో వలలో చిక్కాయి.

ఆ పాముల్ని చూసి జాలరి తొలుత కంగుతిన్నాడు. భయపడి అక్కడి నుంచి పరిగెత్తే ప్రయత్నం చేశాడు. ఆపై దగ్గర్లో కనిపించిన ఒక బడిత తీసుకువచ్చి. ఆ పాములు అన్నింటిని చంపేశాడు.  పదేళ్ళుగా చెక్‌డ్యాంలో చేపలు పడుతున్నానని, ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవ్వలేదని సదరు జాలరి వెంకయ్య తెలిపాడు.

అన్ని పాములు నిష్కారణంగా చంపిన ఆ వ్యక్తిపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. అనుకోకుండా వలలో చిక్కిన పాముల్ని బయట వదిలేయకుండా అలా చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా తమకు లేదా స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం