NTR District: ఈ కలెక్టరమ్మ చేసిన పని ఏంటో తెలిస్తే కచ్చితంగా సెల్యూట్ కొడతారు..

|

Aug 30, 2024 | 1:45 PM

ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతలు వాళ్లు. వారికి ఎవరైనా గౌరవం ఇవ్వాల్సిందే. అలాంటి రైతన్నలు తన ఆఫీసు కార్యాలయంలోకి చెప్పులు విడిచి రావడం ఈ కలెక్టరమ్మకు నచ్చలేదు. దీంతో ఆమె సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు.

NTR District: ఈ కలెక్టరమ్మ చేసిన పని ఏంటో తెలిస్తే కచ్చితంగా సెల్యూట్ కొడతారు..
Collector Srujana
Follow us on

సహజంగానే ఎవరైనా ఆఫీసు బయట చెప్పులు విడిచి లోపలికి రావలెను అని బోర్డు పెడతారు. కానీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీసు బయట మాత్రం పాదరక్షలు ధరించి లోనికి వెళ్లండి అని బోర్డులు పెట్టారు. ఈ బోర్డులు అక్కడికి వెళ్లినవారికి ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగించాయి. వివరాలు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ సృజన కావాలనే ఈ బోర్డులు ఏర్పాటు చేయించారు. కొద్ది రోజుల క్రితం తనను కలిసేందుకు వచ్చిన రైతులు.. చెప్పులు బయట విడిచి.. లోపలికి రావడాన్ని ఆమె గమనించారట. ఆఫీసు లోపల స్టాఫ్ అంతా పాదరక్షలు ధరించే తిరుగుతారు. కానీ అందరి ఆకలి తీర్చే రైతులు అలా రావడం ఆమెకు నచ్చలేదు. దీంతో తన క్యాబిన్లోకి ఎవరైనా చెప్పులతోనే రావచ్చని బోర్డు పెట్టించారు.

పక్కా తెలుగు కుటుంబానికి చెందిన కలెక్టర్ సృజన తన పనితీరుతో అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. పనులు విషయంలో అధికారులను పరుగులు పెట్టిస్తూ ఉంటారు. ఆమె గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో కరోనా ప్రబలుతుండగా, ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చి, మెటర్నటీ లీవ్ ఉపయోగించుకునే అవకాశం ఉన్నా కూడా, తన బిడ్డతో విధులకు హాజరయ్యి.. శభాష్ అనిపించుకున్నారు. సృజన తండ్రి బలరామయ్య రిటైర్ట్ ఐఏఎస్‌. ఆమె భర్త రవితేజ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టిస్ చేస్తున్నారు. సృజన హైదరాబాద్‌లో చదువుకున్నారు. బీఏ సెయింటాన్స్‌లో, ఎంఏ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.