Andhra: వాన వాన వల్లప్పా.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్.. హెచ్చరికలు ఇవిగో

తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మూడు నాలుగు జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఉమ్మడి కర్నూలు, ఉభయగోదావరి జిల్లాల్లో కుండపోత కురుస్తోంది. ఏలూరు జిల్లా ఏజెన్సీలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Andhra: వాన వాన వల్లప్పా.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్.. హెచ్చరికలు ఇవిగో
Andhra Weather

Updated on: Sep 30, 2025 | 2:21 PM

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉంది. సగటు సముద్ర మట్టానికి 3.1 & 7.6 కి.మీ మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణ దిశ వైపుకు వంగి ఉంది. సెప్టెంబర్ 30, 2025న ఉత్తర అండమాన్ సముద్రంలోకి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అక్టోబర్ 01, 2025న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 2న పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 3న ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీ రాలను దాటే అవకాశం ఉంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
—————————————————————————————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
———————————————————————————-

ఈరోజు :-
—————————–

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు:-
————

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
———————————–

ఈరోజు:-
————-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-
————–

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది

రాయలసీమ:-
—————–

ఈరోజు:
—————————————

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.