
తెలంగాణలో గత ఏడాది అంటే 2025 లాస్ట్ 3 రోజుల్లో రూ.980 కోట్ల మద్యం తాగేశారు. ఇక ఏపీలో సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రాలో 2025 డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం డిసెంబర్ 1 నుంచి 31 వరకు మొత్తం మద్యం అమ్మకాలు సుమారు రూ. 2,767 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 2024లో ఇవి రూ. 2,568 కోట్లు ఉండగా, ఈసారి సుమారు 8 శాతం గ్రోత్ నమోదైంది.
ప్రత్యేకంగా డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో అమ్మకాలు భారీగా జరిగాయి. ఈ మూడు రోజుల్లో మాత్రమే సుమారు రూ. 543 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అదే కాలంలో 2024లో అమ్మకాలు రూ. 336 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం.
న్యూ ఇయర్ జోషే ఎక్కువ…
మద్యం అమ్మకాలు ఇంతలా పెరగటానికి నూతన సంవత్సర వేడుకలు, సెలవులు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. కేవలం ఒక నెలలో రూ. 2,767 కోట్ల మందు తాగారంటే నిజంగా ఆశ్చర్యమే. అందులో లాస్ట్ మూడు రోజుల్లోనే 543 కోట్ల రూపాయల లిక్కర్ సేల్ అయ్యిందంటే ఏపీలో న్యూ ఇయర్ జోష్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు
జిల్లాల వారీగా చూస్తే..
మద్యం అమ్మకాలను జిల్లాల వారీగా చూస్తే… విశాఖపట్నం జిల్లా డిసెంబర్ నెలలో అత్యధికంగా సుమారు రూ. 178.6 కోట్లు అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత తిరుపతి జిల్లా సుమారు రూ. 169.4 కోట్లు, ఎన్‌టీఆర్ జిల్లా సుమారు రూ. 155.4 కోట్లు అమ్మకాలతో ముందంజలో ఉన్నాయి. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా సుమారు రూ. 30.7 కోట్లతో చివరి స్థానంలో ఉంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లా సుమారు రూ. 35.4 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లా సుమారు రూ. 65 కోట్లు మాత్రమే అమ్మకాలతో తక్కువ స్థాయిలో నిలిచాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..