CM Chandrababu: ఏపీలోని రైతులందరికీ కానుక.. కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

ఏపీలోని రైతులకు అలర్ట్. నేటి నుంచి ప్రభుత్వం కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేస్తోంది. రైతులకు ఉచితంగా వీటిని ఇంటి వద్దనే అందిస్తున్నారు. రైతులందరూ వీటిని తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ రాజముద్రతో ఈ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి.

CM Chandrababu: ఏపీలోని రైతులందరికీ కానుక.. కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
Chandrababu

Updated on: Jan 02, 2026 | 11:23 PM

ఏపీలో జనవరి 2 తేదీ నుంచి రైతులకు కొత్త పట్టదారు పాపు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నెల 9వ తేదీ వరకు వీటిని రాష్ట్రంలోని రైతులందరికీ అందించనుంది. ఆలోపు పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. ప్రభుత్వ రాజముద్రతో కూడిన ఈ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులందరికీ ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జనవరి 2వ తేదీన రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వీటిని తీసుకోవాలంటే రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సిబ్బంది నేరుగా ఇంటింటికి తిరిగి రైతులకు అందిస్తున్నారు

ప్రభుత్వ రాజముద్రతో..

ఈ కార్యక్రమంపై శుక్రవారం సచివాయలంలో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఎలా జరుగుతుందనే దానిపై మంత్రులతో టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అనేవి రైతులకు ఇస్తున్న న్యూ ఇయర్ కానుక అని అన్నారు. ఎన్నికల సమయంలో కొత్త పాసు పుస్తకాలు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఆ హామీని ఇప్పుడు నెరవేర్చుకున్నట్లు తెలిపారు. రీ సర్వేలో తప్పులు సరిదిద్దిన తర్వాత కొత్త పాసు పుస్తకాలు అందించినట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సీఎం ఫొటోను ముద్రించి ఇచ్చిందని, తాము ప్రభుత్వ రాజముద్రతో మాత్రమే కొత్త వాటిని ఇచ్చినట్లు చెప్పారు.

22 లక్షలు పుస్తకాలు పంపిణీ

రీ సర్వే పూర్తైన గ్రామాల్లోని రైతులకు కూడా కొత్త పాసు పుస్తకాలు అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 22 లక్షల పాసు పుస్తకాలను రీ సర్వే పూర్తైన గ్రామాల్లో రైతులకు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ రాజముద్రతో ఉన్న కొత్త పాసు పుస్తకాలను చూసి రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.