బాధ్యతలు స్వీకరించిన చిత్తూరు కొత్త కలెక్టర్‌.. ఆ విషయంలో కఠినంగా ఉంటానన్న హరినారాయణన్‌

చిత్తూరు జిల్లాలో ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్..

బాధ్యతలు స్వీకరించిన చిత్తూరు కొత్త కలెక్టర్‌.. ఆ విషయంలో కఠినంగా ఉంటానన్న హరినారాయణన్‌

Updated on: Feb 03, 2021 | 1:53 PM

చిత్తూరు జిల్లాలో ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా సచివాలయంలో చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ ఎం.హరినారాయణన్ గారిని అధికారులు కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలను తెలియజేశారు.

జిల్లాలో ఎన్నికల నియమావళిని పాటిస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో సమస్యలు గుర్తించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిపాలన సాగిస్తానన్నారు. ప్రతి ఐ.ఎ.ఎస్ అధికారి సర్వీసులోకి వచ్చేటప్పుడు పారదర్శకమైన పరిపాలనతో ప్రజలకు మేలుచేయాలనే లక్ష్యంతోనే వస్తారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలు, పర్యవేక్షణ కొరకు నాకు ఈ అవకాశం కల్పించడం జరిగిందని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా ప్రజలకు పారదర్శకంగా పరిపాలన కొరకు చర్యలు తీసుకుంటానన్నారు.

 

ఫిబ్రవరి 7న చిత్తూరుకు రాష్ట్రపతి రాక‌.. ఆ ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్ ఆదిత్యనాథ్‌ ఆదేశం