Andhra Pradesh: పంతులు కోపం తెప్పించారు.. మంత్రాలకు బదులు ఏమోచ్చాయో తెలుసా.?

|

Jun 19, 2022 | 11:18 AM

వివాహ వేడుకలలో వధూవరులను వారి స్నేహితులు ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారి చేష్టల వల్ల ఓ వివాహం జరిపించే..

Andhra Pradesh: పంతులు కోపం తెప్పించారు.. మంత్రాలకు బదులు ఏమోచ్చాయో తెలుసా.?
Purohit
Follow us on

సరదాగా చేసే కొన్ని పనులు కూడా కొందరికి ఇబ్బందులు కలగజేస్తాయి. సాధారణంగా పెళ్లిళ్ళలో బంధువులు హడావిడి, బాజాభజంత్రీలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారుతుంది. అయితే వివాహ వేడుకలలో వధూవరులను వారి స్నేహితులు ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారి చేష్టల వల్ల ఓ వివాహం జరిపించే పురోహితుడు ఇబ్బంది పడ్డారు. దీంతో మంత్రాలకు బదులుగా బూతులు మాట్లాడుతూ.. ఆకతాయి యువతీయువలపై ఫైర్‌ అయ్యారు.

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ అనివెట్టి మండపంలో పెద్ద ఎత్తున వివాహాలు జరిగాయి. అయితే ఓ వివాహ వేడుకలో తలంబ్రాలు తంతు ముగిశాక కొందరు స్నేహితులు సరదాగా నూతన వధూవరులపై స్నో స్పై చల్లారు.

అంతటితో ఆగకుండా పక్కనే ఉన్నా పెళ్లి తంతు జరుపుతున్న పురోహితుడిపై స్ప్రే చేశారు. తలమీద నుండి శరీరం మొత్తం స్ప్రే చేయడంతో ఆయన ఒక్కసారిగా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అక్కడి నుంచి పైకి లేచి వారిపై తిట్ల దండకం అందుకున్నారు. అయితే అది చూసిన అందరూ కాసేపు సరదాగా నవ్వుకున్నా పురోహితుడు మాత్రం తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.