చేనేత వస్త్రాలు(National Handloom Exhibition) మన జీవన విధానంతో ముడిపడి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయి. విజయవాడ ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంటుంది. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న జాతీయ చేనేత వస్త్ర కళా ప్రదర్శన చేనేత వస్త్ర ప్రియులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ఆప్కో చైర్మన్ చల్లపల్లి నాగ మోహన్ రావు, ఎండి నాగమణి ఫ్యాషన్ ను ప్రారంభించారు. ఇందులో 15 రాష్ట్రాలకు చెందిన 120 స్టాల్స్ ని ఏర్పాటు చేసి దేశంలో ఉన్న అన్ని రకాల చేనేత వస్త్రాలను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆప్కో స్టాల్ ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చేనేత వస్త్రాలను ఫ్యాషన్ షో అందర్నీ కట్టిపడేస్తోంది.
జాతీయ వినియోగదారులను చేనేత వస్త్రాల వైపుకు ఆకర్షించాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకోగా, పూర్తిగా నూతన వెరైటీలు ఈ ప్రదర్శనలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి కొనుగోలుదారుడు ప్రత్యేక అనుభూతిని పొందేలా వస్త్ర శ్రేణిని ఏర్పాటు చేశారు ఆప్కో. మంగళగిరి, వెంకటగిరి, ఉప్పడ రకాలతో పాటు రెడీమెడ్ వస్త్రాలు ఇక్కడ లభిస్తున్నాయి.
ఆప్కో చైర్మన్ చల్లపల్లి నాగ మోహన్ రావు, ఎండి నాగమణి ఫ్యాషన్ షో తిలకించి ఆంధ్ర ప్రదేశ్ ఉత్పత్తి చేస్తున్న చేనేత వస్త్రాలను దేశవ్యాప్తంగా మార్కెట్ కల్పించడానికి ఒక గొప్ప వేదిక అన్నారు. భారతదేశం అపూర్వమైన అద్భుతమైన నైపుణ్యం చేనేత వస్త్రాలు ద్వారా తెలుస్తుందన్నారు. ఏపీలో చేనేత వస్త్రాలకు ప్రజలు ఆదరిస్తున్నారని ఈ నెల 18 వరకు జరిగే చేనేత వస్త్రం ప్రదర్శనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి: Honey Bitter: ఇక్కడ తేనె చెదుగా ఉంటుంది.. అయినా అమృతమే.. ఈ ప్రదేశంలో అదే స్పెషల్.. ఎక్కడంటే..
Andhra Pradesh: జోలె పట్టి భిక్షాటన మొదలు పెట్టిన సర్పంచ్.. కదలివచ్చిన గ్రామం.. కారణం తెలిస్తే..